A Melodious duet of SP Balu, P Susheela in the movie Subhalekha (1982).
చిత్రం : శుభలేఖ (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
#subhalekha,
#aithe_ade_nijamaithe,
#chiranjeevi_songs,
#sumalatha,
#kviswanath,
పల్లవి :
ఐతే..అది నిజమైతే..అదే నిజమైతే
ల ల ల ల ల..
ఐతే.. అది నిజమైతే..అదే నిజమైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఈ గువ్వకి ఆ గువ్వే తోడైతే
అది పువ్వుల నవ్వుల పున్నమి వెన్నెల గూడైతే
ఐతే.. అది నిజమైతే.. అదే నిజమైతే
చరణం 1 :
నింగిలోని చంద్రుడికి.. నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
ఆ..ఆ.... ఆ..ఆ
నింగిలోని చంద్రుడికి..నీటిలోని కలువకి
దూరభారమెంతైనా రాయబారి నేనున్నా
చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింతే పున్నమిగా
ఆ..... ఆ....ఉ.. ఉ....
చందమామ అవునంటే వెన్నెలగా
కలువ భామ అది వింటే పున్నమిగా
నా ఆశలు ఎగసి ఎగసి తారలతో కలిసి
తలంబ్రాలుగా కురిసే వేళా.. చేరువైతే
ఐతే..అది నిజమైతే.. అదే నిజమైతే
ల ల ల ల ల..
ఐతే.. అది నిజమైతే.. అదే నిజమైతే
చరణం 2 :
ల ల ల ల ల..
రెమ్మ చాటు రాచిలక.. కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే
రెమ్మ చాటు రాచిలక.. కొమ్మ దాటి గోరింక
చూపులతోనే రాయని శుభలేఖలు రాస్తుంటే...
ఆకసాన అరుధంతీ నక్షత్రం
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
ఆ...... ఆ.....ఉ.. ఉ....
ఆకసాన అరుధంతీ నక్షత్రం
తెలిపిందీ ఇదేననీ సుముహూర్తం
మనసిచ్చిన మలిసంధ్యలు కుంకుమలై కురిసీ
నుదుట తిలకమై మెరిసే వేళా.. చేరువైతే
ఐతే.. అది నిజమైతే.. అదే నిజమైతే
ల ల ల ల ల
ఐతే... అది నిజమైతే.. అదే నిజమైతే
ల ల ల ల ల
Ещё видео!