Mega parent teacher meeting welcome song #school #Mptmsong #song #telugu
స్వాగతం సుస్వాగతం!
రేపటి భవితకు వారసులనొసగిన
తల్లీదండ్రులకు స్వాగతం! సుస్వాగతం!
వెలిగే జ్యోతులను కనులారా కాంచగ రారండి !
మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి!
బంగరు భవితకు పునాదులై అండగ నిలవగ రారండీ!
పిల్లల చదువులతో విశ్వం వెలిగేను విజ్ఞాన కాంతులతో!
మీ ఆశయాలకు చక్కని రాదారి మన వూరి బడియే!
గురువుల సన్నిధిలో రాయి కలికితురాయిగ మెరిసేను!
మీ రాకతో చదువుకు చుక్కానియై విఘ్నాలు తొలిగేను!
స్వాగతం సుస్వాగతం!
రేపటి భవితకు వారసులనొసగిన
తల్లీదండ్రులకు స్వాగతం! సుస్వాగతం!
మీ మాటలతో పిల్లలు గురిపెట్టును లక్ష్యం వైపు!
మీ సూచనలతో అడుగులు వేయును సరైన గమ్యం వైపు!
విద్యాలయం మనది వినూత్న మార్గాల పెన్నిధై
మన చదువుల తోటలో నిత్యం గుభాలించు వికాస పూలై!
మీరిటువేసే ప్రతి అడుగు పయనించు విజయానికి బాటై!
స్వాగతం సుస్వాగతం!
రేపటి భవితకు వారసులనొసగిన
తల్లీదండ్రులకు స్వాగతం! సుస్వాగతం!
వికసించే విద్యాతరువుకు
మీ సౌహార్దం సంతోషమే కాంతి రేఖలు!
మీ సాన్నిహిత్య పలుకులే ఆశల సాకార నిలయాలు!
మనదే మనదే ఈ బడి
మనందరి ఆశల గుడి
అందరమొకటిగ నడిస్తాం!
విజయ బావుటా ఎగరేద్దాం!
స్వాగతం సుస్వాగతం!
రేపటి భవితకు వారసులనొసగిన
తల్లీదండ్రులకు స్వాగతం! సుస్వాగతం!
వెలిగే జ్యోతులను కనులారా కాంచగ రారండి !
మీ కలల సాకారమునకు వడివడిగా అడుగులు వేస్తూ రారండి!
బంగరు భవితకు పునాదులై అండగ నిలవగ రారండీ!
Ещё видео!