Keerthana : Takkuvemi Manaku
Ragam : Saurashtra
Thalam : Adi
#2024, #tuesday, #devotionalsongs #sriram #jaishriram #ramadasu #ramadasukeerthana, #youtube, #music #keerthanaclassicalsongs #keerthanalu
Navaratna Keertanas of Bhadrachala Ramadasu. Arranged and performed by Sangeetha Kalanidhi Dr. Sri Nedunuri Krishnamurthy. Supporting vocalists: Malladi Brothers, Smt K Seshulata, Smt Neeta Chandrasekhar, Smt Lalitha Vijaykumar. Accompaniments: Sri BS Narayanan on Violin, Sri MLN Raju on Mridangam, Sri Meduri Srinivas on Veena and Sri Panduranga Mutalik on Sitar.
పల్లవి
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు
ప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ||
1. మ్రుచ్చు సోమకుని జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి ||
2 . సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి ||
3. దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి ||
4. హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి ||
5.భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి ||
6. దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి ||
7.దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి ||
8. రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ || తక్కువేమి ||
Ещё видео!