ఈ వసుచరిత్ర కావ్యాన్ని రచించింది రాయలవారి అష్టదిగ్గజ కవులలో ఒకరైన రామరాజభూషణుడు. ఈయననే భట్టుమూర్తి అని కూడా పిలుస్తారు. ఈ వసుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఒకటిగా పేరుపొందింది. ఇందులో కథ చాలా చిన్నది. కానీ వర్ణన మాత్రం అసాధారణ స్థాయిలో ఉంటుంది. నైమిశారణ్యంలో ఉన్న శౌననకాది మునిపుంగవులకు సూత మహర్షి ఈ వసుచరిత్ర చెబుతున్నట్లుగా కథ మొదలవుతుంది. ఇక మనం కూడా ఆ కథ లోకి ప్రవేశిద్దాం.
Ещё видео!