- విజయవంతంగా ముగిసిన చెవిరెడ్డి షిరిడీ యాత్ర..!
- పోను 30 గంటలు, రాను 30 గంటలు రైలు ప్రయాణం.
- ఒక రోజంతా షిరిడీలో బస, 54 అద్దె బస్సులు వినియోగం.
- స్టార్ హోటళ్లలో వసతి, పసందైన భోజన సౌకర్యాలు .
- వీఐపీ దర్శనంతో పార్టీ క్యాడర్ లో మిన్నంటిన ఆనందం .
- నాలుగు రోజులు పార్టీ క్యాడర్ తో చెవిరెడ్డి కుటుంబం మమేకం.
చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి దైవదర్శనానికి బయలుదేరిన చెవిరెడ్డి షిరిడీ యాత్ర విజయవంతంగా ముగిసింది. ఆరు మండలాల నుంచి రెండు వేల మందితో షిరిడీ యాత్రకు బయలుదేరిన చెవిరెడ్డి కుటుంబం నాలుగు రోజుల పాటు వారితో మమేకమైంది. అందరికీ సౌకర్యవంతంగా ఉండటం కోసం 24 బోగీలతో ఒక ప్రత్యేక రైలును బుక్ చేశారు చెవిరెడ్డి. ఇండియన్ రైల్వే, ఐఆర్ సీటీసీ వారి సహకారంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసుకున్న చెవిరెడ్డి గత నెల 30వ తేదీన తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి షిరిడీ యాత్రకు బయలుదేరారు. నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా సాగిన షిరిడీ యాత్ర శుక్రవారం తిరుపతికి చేరడంతో ముగిసింది.
చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు షిరిడీ యాత్రకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలులో రెండు వేల మంది ఎక్కడంతో వారందరి ప్రయాణానికి ఏలాంటి ఆటంకాలు కలుగకుండా ముందుగానే ఎవరి సీట్లు వారికి కేటాయించారు. కొంత మంది సీట్లు లేకుండా కింద పడుకుని వస్తామనడంతో వారికి కూడా అప్పటికప్పుడు పడుకోవడానికి అనువుగా బెడ్ లు, దిండులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కో బోగిలో ఎంత మంది ఎక్కారో తెలుసుకుని అందరికీ సరిపడ భోజనం తాగునీరు అందించిందేకు చెవిరెడ్డి నిరంతరం శ్రమించాల్సి వచ్చింది.
సౌకర్యాల కల్పనపై సర్వత్రా హర్షం
నాలుగు రోజుల షిరిడీ యాత్రలో పోను 30 గంటలు, రాను 30 గంటలు రైలులో ప్రయాణం సాగించాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి రైలు ఆలస్యంగా నడిచినప్పటికీ అల్పాహారం, భోజనం విషయాలలో ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు చెవిరెడ్డి. నాలుగు రోజుల యాత్రలో రెండు వేల మంది పార్టీ నాయకులు కార్యకర్తలకు చెవిరెడ్డి అందించిన సౌకర్యాలపై ప్రతి ఒక్కరూ ప్రసంశలు కురిపించారు. తిరుచానూరు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరినప్పటి నుంచి రైలులో అందరికీ సరిపడేలా 25వేల ఒక లీటరు వాటర్ బాటిల్స్, స్వీట్లు, హాట్, బిస్కట్లుతో కూడిన స్నాక్స్, ప్రెష్ అవడానికి అవసరమైన సోపు, షాంపు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, దువ్వెన వంటి కాస్మోటిక్ కిట్లను కూడా అందించారు. రైలు ప్రయాణంలో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే అందుకు తగిన మందులతో పాటు ఒక వైద్యుడుని కూడా అందుబాటులోకి తెచ్చారు.
షిరిడీలో 54 అద్దె బస్సులు 700 విశ్రాంతి గదులు
షిరిడీ రైల్వే స్టేషన్ లో దిగినప్పటి నుంచి తిరిగి రైలు ఎక్కేంత వరకు 54 అద్దె బస్సులను వినియోగించారు. షిరిడీ రైల్వే స్టేషన్ నుంచి అతిథి గృహాల వద్దకు అక్కడ నుంచి ఆలయం వద్దకు దర్శనానంతరం తిరిగి అతిథి గృహాలకు అద్దె బస్సులు చక్కర్లు కొట్టాయి. ఆ తరువాత మరుసటి రోజున ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు అతిథి గృహాల నుంచి కల్యాణ మండపం వద్దకు అక్కడ నుంచి రైల్వే స్టేషన్ కు పార్టీ క్యాడర్ ను తరలించేలా చెవిరెడ్డి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిరిడీలోని స్టార్ హోటళ్లలో 700 గదులను అద్దెకు తీసుకుని అందులో పార్టీ క్యాడర్ ను బస ఏర్పాట్లు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా రైలులో 3 బోగీలు, విశ్రాంతి కోసం షిరిడీలో 70 గదులను కేటాయించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్ర
షిరిడీ యాత్రకు 24 బోగీలతో బయలుదేరి ప్రత్యేక రైలులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు చెవిరెడ్డి. వాకీటాకీలతో కూడిన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి బోగీకి ఒక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 5 బోగీలకు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేశారు. అలాగే రైలులో ప్రయాణించే వారికి ఏ అవసరం వచ్చినా అందించడానికి ప్రతి బోగీకి ఒక అటెండర్ తో పాటు ఒక పీఆర్వో, ఒక ఏపీఆర్వోలను ప్రతి 5 బోగీలకు ఒక సీపీఆర్వోను ఏర్పాటు చేశారు. వీరందరితో పాటు 2వేల మంది పార్టీ క్యాడర్ తో ప్రతి రెండు గంటలకు ఒక సారి చెవిరెడ్డి టెలీకాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆయన తమపై చూపుతున్న శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు.
చెవిరెడ్డి కుటుంబం క్యాడర్ తో మమేకం
షిరిడీ యాత్రలో భాగంగా నాలుగు రోజుల పాటు పార్టీ క్యాడర్ తో చెవిరెడ్డి కుటుంబం మమేకమైంది. చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మీ, కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ అందరితో సరదాగా గడిపారు. 60గంటల రైలు ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కోసారి ప్రతి బోగీకి వెళ్లి పార్టీ క్యాడర్ తో మమేకం కావడం అందరిలో ఆనందాన్ని తెచ్చింది. గత ఎన్నికల్లో మోహిత్ రెడ్డి ఓటమి పట్ల చాలా మంది పార్టీ నేతలు బాధ పడటంతో వారికి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి కుటుంబం ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమే కనుక భవిష్యత్తులో కలసి మెలసి ఎంతో ఐక్యతతో పనిచేయాలన్నారు. సరదాగా సాగిన నాలుగు రోజుల షిరిడీ యాత్ర విజయవంతంగా ముగియడంతో పార్టీ నేతలు అందరూ చెవిరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని, మీతో పాటు ఎందాకైనా నడుస్తామని మాట ఇచ్చారు.
#chevireddybhaskarreddy #shirdisaibaba #shiridi #chandragiri #chandragiriconstituency
Ещё видео!