చికెన్ సూప్ | Chicken Soup | How to Make Chicken Soup in Telugu | Soup @HomeCookingTelugu
చికెన్ సూప్‌ను నాన్-వెజ్ తినేవారిలో చాలామంది ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. ఈ సూప్ చేసేటప్పుడు బోన్ ఉన్న చికెన్‌ని వాడితేనే బాగుంటుంది, ఎందుకంటే మంచి ఫ్లేవర్ మొత్తం బోన్లోనుంచి వస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#chickensoup #homecookingtelugu #southindianchickensoup #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 5
కావలసిన పదార్థాలు
చికెన్ - 500 గ్రాములు
ధనియాలు - 2 టీస్పూన్లు (Buy: [ Ссылка ])
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
మిరియాలు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
అల్లం
వెల్లుల్లి రెబ్బలు
నూనె - 2 టీస్పూన్లు (Buy: [ Ссылка ])
దాల్చిన చెక్క (Buy: [ Ссылка ])
లవంగాలు (Buy: [ Ссылка ])
యాలకులు (Buy: [ Ссылка ])
బిర్యానీ ఆకు (Buy: [ Ссылка ]) )
ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చిమిరపకాయ - 1 (తరిగినది)
కరివేపాకులు
టొమాటోలు - 2 (తరిగినవి)
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
నీళ్లు - 3 కప్పులు
తరిగిన కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా ఒక రోట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలను వేసి దంచుకుని పొడి పట్టి, పక్కన పెట్టుకోవాలి
ఆ తరువాత అల్లం, వెల్లులిని వేసి, దంచి పక్కన పెట్టుకోవాలి
ఒక ప్రెషర్ కుక్కరులో నూనె వేసి, అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు అన్నీ ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా వేయించాలి
ఇప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి వేసి వేయించిన తరువాత టొమాటోలను వేసి బాగా కలపాలి
ఆ తరువాత పసుపు, చికెన్ ముక్కలని వేసి బాగా కలిపి కే=కాస్త వేయించిన తరువాత ఉప్పు, దంచిన ధనియాలు జీలకర్ర మిరియాల పొడి కూడా వేసి కలిపి, నీళ్లు పోసుకోవాలి
నీళ్లలో ఒక ఉడుకు వచ్చిన తరువాత కుక్కరుకి మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 2 - 3 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
చివరగా పైన కొంచెం కొత్తిమీర చల్లి, చికెన్ సూప్‌ను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!