30 నిమిషాలలో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చెయ్యండి. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను "శ్రీ సాయి సచ్చరిత్ర గానామృతము"గా రూపొందించుట జరిగినది.
శ్రీ సాయి సచ్చరిత్ర గానామృతమును వేలాది భక్తులు పారాయణ చేసి తమ కష్టనష్టములను తీర్చుకున్నారు.
దీనిని పారాయణ చేస్తుంటే సాయినాధుడు మన ముందు మళ్ళీ కదలాడుతూ ఆ లీలలన్నీ చేసినట్లుగా అనుభూతి పొందవచ్చును.
ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేయుదురో వారికి శ్రీ సాయినాధుడే స్వయముగా వారి వారి యోగక్షేమాలు చూచెదరు.
ఏదైనా సంకల్పము నెరవేర్చుకొనవలసినవారు, సాయి పటము ముందు తమ సంకల్పం చెప్పుకొని, సాయినాధుడే స్వయముగా వినుచున్నాడని భావించవలెను. ఈ పారాయణము చేయునప్పుడు భక్తి, శ్రద్ధలతో ఉండి, ఆయనే దీనిని గ్రహించునట్లు భావించవలెను.
కనీసం 11సార్లు పారాయణ చేసినవారికి కామధేనువు వలె శ్రీ సాయి నాధుడు వెంట ఉండి కాపాడును.
Ещё видео!