#VIPLAVACHEGUVERALU l #GEORGEREDDY SONG #YOCHANA #RAMANCHABHARATH #TELANGANAFOLKSONGS #GALAMTV
Lyrics: Yochana
Singer: Ramancha Bharath
Music: Kittu Keys
Dop Editing: Santosh Star
Thank You: Chorus Team
Special Thanks: K Govardan
Producer: Dasari Bhaskar
విద్యార్థి వీరులు విప్లవ చేగువేరలు
అక్షరాల తారలు జార్జిరెడ్డి వారసులు
నిప్పుల దారులల్లో ఎత్తిన ఉక్కు పిడికిళ్ళు
నెత్తురు ధారపోసి తెంచిరి బానిస సంకెళ్లు
మీరే భగత్ సింగ్ లు రాజగురు సుఖదేవులు
మీరే మీరే మీరే జంపాల ప్రసాదులు శ్రీపాద శ్రీహరులు..
!!విద్యార్థి!!
కొట్టిరి ఏనుగు కుంభాలు ఎక్కిరి ఉరి కంబాలు
ఎత్తిరి ఎర్రని జెండాలు ఎలుగెత్తిరి ఖండ ఖండాలు
మాసిపోవు మీ త్యాగాలు వీరులారా ఎర్ర దండాలు..
మీరే టావ్ చింగులు రంగవల్లి స్నేహలతలు
మీరే మీరే మీరే మారోజు వీరన్నలు వీరాధివీరన్నలు...
!!విద్యార్థి!!
పట్టణాలను వదిలి పెట్టినారు
పల్లెలకు బాట పట్టినారు
కత్తులోలె మొన దేరినారు
పెత్తనాలను తెగ నరిగినారు
విత్తనాలై రాలిపోయినారు
భూమి పొత్తిల్లో మొలకెత్తినారు
మీరే చాంద్ పాషలు చేరాలు రమణయ్యలు
మీరే మీరే మీరే వీరారెడ్డి మధుసుదనులు
ఆయుధాలకే పదునులు
!!విద్యార్థి వీరులు!!
చదువుల సంఘాలు పెట్టినారు
సావుతో చెలగాటమాడినారు
అడవికి అ ఆ లు నేర్పినారు
ఆకలికి ఆయుధాలిచ్చినారు
వియత్నాం చైనా వీరులయ్యి
మా మాసియాంగ్ ధ్రువ తారలైరీ...
మీరే బిక్షమయ్యలు రక్షణ దారి అడుగులు
మీరే మీరే మీరే మీరే మీరే కోల శంకరు సాంబయ్యలు యుద్ధములో బాంబులైనరు...
!!విద్యార్థి వీరులు!!
Ещё видео!