వేటపాలెం మండలం రామచంద్రపురం మత్స్యకార గ్రామం కు చెందిన మత్స్యకారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి కోడూరు వెంకటేశ్వర కుటుంబాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్.. ఆర్డిఓ ప్రభాకర్ రెడ్డి కలిసి వారికి జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు
స్థానిక రామచంద్ర పురం గ్రామం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ ప్రభాకర్ రెడ్డి కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో ఎన్ని కట్టుబాట్లు ఉన్న చట్టానికి అనుకూలంగానే ప్రతి ఒక్కరూ జీవించాలని ఒక కుటుంబాన్ని వెలి వేసే హక్కు ఏ కుటుంబానికి గాని ఏ గ్రామానికి లేదని సమస్యల్ని గ్రామంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని జీవించాలని కోడూరి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామంలో నివసించే విధంగా ప్రతి ఒక్కరు సానుకూలంగా స్పందించాలని అలా కాకుండా చట్ట వ్యతిరేక విధానాలకు గ్రామస్తులు పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని వారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బాపిరెడ్డి. RDO ప్రభాకర్ రెడ్డి. ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడి రంగనాథ్. జె డి ఎఫ్ చంద్రశేఖర్ . వేటపాలెం తాసిల్దార్ లింగ మహేశ్వరరావు. చీరాల రూరల్ సిఐ రోశయ్య తదితరులు పాల్గొన్నారు
Ещё видео!