#mango
#food
#foodbook
బనగానపల్లె సంస్థానం నవాబు మీర్ గులాం అలీ ఖాన్ గారికి మామిడి పండ్లు అంటే అత్యంత ప్రీతి. కావున వివిధ రకాల మామిడి మొక్కలు సేకరించి సంస్థానం ఆవరణలో నాటించేవారు.ఆ క్రమంలో మేలిమి రకం బెనిషాన్ గురించి తెలుసుకున్న ఆయన విస్తృతంగా సాగు చేయించారు .ఆ ఫలం పసిడి వర్ణంలో చూపులకు ఆహ్లాదకరంగా రుచికి మధురానుభూతి ఇస్తుండటంతో విశేష ప్రాచుర్యం పొందింది.దరిమిలా ఈ రకం మామిడి సాగు బనగానపల్లె నుండి తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు విస్తరించి.కాల క్రమంలో బనగానపల్లె మామిడి బంగినపల్లి మామిడి గా మారింది.తన సహాజత్వంతో ప్రజలకు మాధుర్యం పంచుతున్న బంగినపల్లి మామిడి ఆంధ్రప్రదేశ్ సొంతమని ఇప్పటికే భౌగోళిక విశిష్ట గుర్తింపు పొందింది.ఉలవపాడు ప్రాంతంలో వేలాది ఎకరాల్లో వివిధ రకాల మామిడి పండ్లు పండిస్తారు.రసాలు తయారీకి ఇక్కడి నుండి తీసుకువెళ్తారు.సారవంతమైన ఎర్ర మరియు ఇసుక నేలలు అమృత ఫలంగా మార్చయు కావున అంతటి ప్రసిద్ధి లభించింది.ఇక్కడ జాతీయ రహదారికి ఇరువైపులా మామిడికాయ దుకాణాలు కనిపిస్ధాయి.మేలైన మధురమైన ఉలవపాడు మామిడి తినాలంటే తోటకు వెళ్లే కొనుగోలు చేయడం మంచిది. ధర తక్కువగా ఉంటుంది.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!