#MANALAADAVULLO FULL SONG #VIPLAVAGEETHAM l DR #VENNELASREENATH l #SINGERASHWINI SONGS l TELANGANA SONGS l #GALAMTV CHANNEL
Lyrics and Tune: Dr. Vennela Sreenath Cell : 9550729443
Singer: Ashwini
Music: Wilson Rudrarapu
Camera & Editing: Rajesh Patel
Producer: Dasari Bhaskar
Co - Producer: Puli Prasanna
మానాల ఆడవుల్లో మల్లెలు పూసెను
మంచి మంచి మల్లెలమ్మ
అవీ ఎర్రని మల్లెలమ్మ
ఎర్రని మల్లెలమ్మ...
ఏడేడూ దారుల్లో ఎర్రని దారుల్లో ll2ll
ఎదిరించి పోరాడిరమ్మ
ఎర్ర జెండాను ముద్దాడిరమ్మ
తను వెల్ల గాయాల త్యాగల భూముల్లో
ఎందరో ఆమరులయ్యారో
వీరాది వీరులు నేల కొరిగారో ll2ll
ఇందూరిలోనే చిందింది నెత్తురు
ఎండిన ఆకుల అడివమ్మ సాక్షిగా
ఆ జ్యోథియా నాయక్ గుట్టల మీద
జరిగిన పోరాట యుద్ధంలోన
ఏ వూరి బిడ్డలో ఏ తల్లి కొడుకులో ఓ.. ఓ.. ఓ..
ఏ వూరి బిడ్డలో ఏ తల్లి కొడుకులో
ఎక్కడి నుండొచ్చినరో
వారు మానాల కెందుకొచ్చారో ll2ll
ఆ తూరుపు కొండలో మండేటి ఎండల్లో
తూటాల వాన కూరిసిందో
తూపాకీ తూటాల వాన కూరిసిందో
ఆ తూటాల వానకు నెత్తుటి దారకూ
అడివంత తడిసి పోయిందో
ఆ నేలంత ఎర్ర బారిందో
నింగి నేలంత ఎర్ర బారిందో....
మానాల ఆడవుల్లో మల్లెలు పూసెను
మంచి మంచి మల్లెలమ్మ
అవీ ఎర్రని మల్లెలమ్మ...
ఏడేడా తిరిగిరో కునుకేడ దీసిరో
అద్దుమ రాతిరి ఆ అడవి దారుల్లో
ఏ గుడెమేల్లిరో ఏ తండా జెరీరో
నడుమంత నోయ్యంగా కాళ్ళని గుంజంగా
ఏ గూటీ పంక్షులో ఎవరింటి పిల్లలో ఓ.. ఓ.. ఓ..
ఏ గూటీ పంక్షులో ఎవరింటి పిల్లలో
శత్రువు కంట పడ్డారో
నిద్దర మత్తులో పట్టు బడ్డారో ll2ll
పడగ విప్పిన నల్ల త్రాచు పాములన్ని
పగ పట్టి కాటేసినయ్యె
పంచ ప్రాణాలు తోడేసినయ్యో
ఉరుములు మెరుపులు ఒక్కటై వచ్చి
పిడుగులు మిద పడ్డాయో
ఫిరంగి తూటలెన్నో పేలినయ్యో
మానాల అడవుల్లో గిరిజన తండాలో
నెత్తుటి ఓలాడినాదో సర్కారు
కత్తుల కంచ నాటిందో
నెత్తుటి ఓలాడినాదో సర్కారు
కత్తుల కంచ నాటిందో
నెత్తుటి ఓలాడినాదో... ఓ .....
Ещё видео!