మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని అనేవారు కొందరుంటే.. "సరైన మంత్రం చదివితే ఎందుకు రాలవ్? తప్పకుండా రాలతాయి" అనేవారూ ఇంకొందరుంటారు. ఇలా చింతకాయలేమిటి వేదమంత్రశక్తితో కుంభవృష్ఠినే కురిపించిన ఋషులవంటి మహానుభావులు మనకు కాస్తంత ముందుకాలంలో కూడా ఉన్నారు. ఈరోజు అటువంటి ఒక మహాపురుషుని గురించి చెప్పుకుందాం. ఈ సంఘటన ఎప్పుడో వందలయేళ్ళ క్రితం జరిగింది కాదు. సుమారు 44 సంవత్సరాల క్రితం జరిగింది. భక్తజనంతో పాటూ పత్రికా విలేఖరులు, అధికారుల సమక్షంలో జరిగింది. మన సనాతన ధర్మ వైభవాన్ని, మన జాతి గొప్పదనాన్ని చాటిచెప్పే ఆ సంఘటనను ఈరోజు చెప్పుకుందాం.
Ещё видео!