సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు.
♦️ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు.
♦️“సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లించేది గ్యారెంటీ. ఈ విషయంలో ఎవరినీ నమ్మకండి. రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు తుమ్మల గారు, పొంగులేటి గారి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాం.
♦️ఈ నెలలో జరిగే శాసనసభ సమావేశాల్లో విధివిధానాలపై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం. రైతు భరోసా పథకం కొనసాగుతుంది.
♦️గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతూనే, నాలుగు విడతల్లో కలిపి మొత్తంగా 25,35,964 మంది రైతు కుటుంబాలకు 20,616.89 కోట్ల రూపాయల మేరకు రుణ మాఫీ చేశాం.
♦️దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఈ దేశంలోనే ఇదొక రికార్డు.
♦️గతంలో... వరి వేస్తే ఉరి వేసుకోవలసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రాలే ఉండవని చెప్పిన పరిస్థితుల నుంచి వరి వేసుకోండి. కొంటామని చెప్పి భరోసా ఇవ్వడంతో పాటు సన్నాలు వేసుకుంటే బోనస్ ఇస్తామని ప్రోత్సహించాం.
♦️వర్షాకాలంలో సన్నాలకు బోనస్ ఇచ్చాం. బోనస్ ఒక్కసారి ఇచ్చి వదిలేయడం కాదు. వచ్చే సీజన్ లో కూడా బోనస్ ఇస్తాం. తెలంగాణలో వాడకం ఎక్కువగా ఉన్న, అలాగే దిగుబడి అధికంగా ఉండే తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వేయాలి. తెలంగాణ ప్రజలు అత్యధికంగా ఈ బియ్యం ఎక్కువగా తింటారు.
♦️రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి ప్రభుత్వ వసతి గృహాల్లో సన్న బియ్యంతో అన్నం పెట్టనున్నాం. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం అధిక వినియోగం ఉన్న సన్న రకాలను వేయాలి.
♦️ఇందులో రాజకీయాలు చేసే సందర్బంగా కాదు. ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది. వ్యవసాయం దండగ కాదు. పండుగ అన్న భరోసా రైతుల్లో కల్పించాలి” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.
Hon’ble Chief Minister Shri A. Revanth Reddy assured Telangana’s farmers that the Rythu Bharosa (Farmers’ Guarantee) payments will be disbursed after the Sankranti festival. Speaking at a media conference alongside senior ministers, he announced that the policies will be finalized during the December legislative assembly session, with a cabinet sub-committee led by Deputy Chief Minister Mallu Bhattivikramarka overseeing the process. Reflecting on the success of the Farmers’ Festival in Palamuru, organized as part of the Praja Vijayotsavam, the Hon’ble CM reiterated his government’s unwavering support for farmers and urged them to trust official communications over rumors.
The Hon’ble CM highlighted his government’s record-breaking loan waiver of ₹20,616.89 crores, benefiting 25.35 lakh farmer families, a milestone unmatched in the country’s history. Unlike previous governments that left farmers in despair, his administration is committed to promoting high-yield varieties like Telangana Sona, BPT, and HMT, ensuring purchase guarantees and providing seasonal bonuses. Fine rice is being distributed through ration shops and government hostels serving SC, ST, BC, and minority communities. Hon’ble CM Revanth Reddy affirmed, “This government is dedicated to farmers. Agriculture is not a struggle; it is a festival, and we are committed to ensuring it becomes a source of pride and prosperity for every farmer in Telangana.”
#telangana #cmrevanthreddy #rythubharosa #revanthreddy #telanganafarmers #farmers #prajapalana #prajavijayotsavam #farmersguarantee #telanganasona #agriculturere #farmerswelfare #loanwaiver #sankrantiassurance #telanganadevelopment #farmersfestival #cropsupport #finerice #farmloanwaiver #telanganarising #hyderabadrising #telangana #cmrevanthreddy #rythupanduga #farmer #telanganafarmers #runamafi #rythubharosa #farmers #cmrevanthforfarmers #prajapalana #prajavijayotsavalu #indiramma #indirammarajyam #farmloanwaiver #farmersloans #agriculture #mahabubnagar #amistanpur #mahabubnagarrythupanduga #telanganarising #hyderabadrising #hyderabad #bhattivikramarka #tummalanageswararao #duddillasridharbabu #damodarrajanarsimha #seethakka #dansarinansuya #uttamkumarreddy #jupallykrishnarao #ponguletisrinivasareddy #ponguleti #komatireddyvenkatreddy #ponnamprabhakar #kondasurekha #telanganaministers #telanganagovernment #telangana #revanthreddy #farmloanwaiver #loanwaiver
Ещё видео!