ఆదరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితమే భేజారై పోయే (2)
ఆ దరి చేరే హైలెస్సో హైలో హైలెస్సా (2) ||ఆదరి చేరే||
1.విద్య లేని పామరులను పిలిచాడు - దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి - ఈ భువిలో నాకుమీరే సాక్షులన్నాడు (2) ||ఆదరి||
2.ఆ సుడి గాలులేమో వీచెను - అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను - నా జీవితాన చీకటే మిగిలిపోయేను (2) ||ఆదరి||
3. వస్తానన్నాడు విభుడు మాట తప్పడు - ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నా చెంతనుండగా - ఎందుకు నీ హృదయాన ఈ తొందర (2)
ఆదరి చేరే దారే నా ప్రభువు -
పడవలోన కాలు నిలిపి చూడు
ఈ జీవితాన వెలుగు నిండే చూడు(2) ||ఆదరి||
Ещё видео!