#vamsibudgettraveller #pushpagiri #kadapadistrict.
Address :- Pushpagiri Temple, Valluru Mandalam, Kadapa District.
ఈ వీడియోలో మీకు ఆంద్రప్రదేశ్ లోని కడపజిల్లాలో ఉన్న పుష్పగిరి లోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని పూర్తిగా చూపించడం జరిగింది. ఈ పుష్పగిరి లో పెన్నానదికి అవతలి వైపు వైద్యనాదేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఇవతల పక్క కొండ అంచున పెన్నానది ఒడ్డున ఈ వీడియోలో మనం చూస్తున్న పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంతో పాటు, రుద్ర పాదాలు, విష్ణు పాదాలు కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ ప్రతి శనివారం విశేష పూజలు చేస్తారు అలాగే శనివారం మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది , అయితే ఇక్కడ పెద్దగా సౌకర్యాలు అందుబాటులో ఉండవు స్వామివారి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పట్టదు ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ పుష్పగిరి చెన్నకేశవ స్వామివారి ఆలయంలో దర్శనం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 వరకు తరువాత సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాత్రమే స్వామి వారి దర్శనం ఉంటుంది, ఇక్కడి ఆలయంలో శిల్ప సంపద చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా పుష్పగిరి చెన్నకేశవ స్వామివారి ఆలయానికి వచ్చిన వారు ఇక్కడి ఆలయ ప్రాకారాలమీద ఉన్న శిల్పాలను తప్పకుండా వీక్షించి వెళ్ళండి. ఇది కడప నుండి మైదుకూరు వెళ్లే ప్రధాన మార్గంలో కొంచెం లోపలికి ఉంటుంది అడ్రస్ వివరంగా వీడియోలో చెప్పాను.
జై జవాన్ - జై కిసాన్.
Ещё видео!