vandanamo vandanam yesayya - వందనమో వందన మేసయ్యా Song Lyric :
"శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక." యూదా Jude 1:25
పల్లవి: వందనమో వందన మేసయ్యా - అందుకొనుము మా దేవా
మాదు - వందన మందుకొనుమయా
1. ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో
మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా
2. పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన
3. ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా
దేవా హృదయార్పణ నర్పింతు
4. అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు
5. జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా
రాజా నీకిదే నా స్తుతియాగం
6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు
క్షితినిన్ చేరి స్తుతింతు
7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడ - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా
నీకిదే వందనమందుకొనుమయా
Ещё видео!