AMPM Live : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి జి.వి.రఘురామరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విశాఖ ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘుకు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించినట్లు ఏసీబీ డిఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. ఏసీబీ నిర్వహించిన తనిఖీల్లో రఘుకు చెందిన ఆస్తులు, నగలు, నగదు భారీగా బయటపడ్డ విషయం తెలిసిందే. వీటి విలువ సుమారు రూ.500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేసారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రఘును కస్టడీకి అనుమతించాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. దీనికి సంబంధించి పిటిషన్ ను బుధవారం అధికారులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.
-~-~~-~~~-~~-~-
Please watch: "AMPM Live News Roundup || 24-08-2019 || Bulletin"
[ Ссылка ]
-~-~~-~~~-~~-~-
Ещё видео!