అజగవ సాహితీ ఛానల్ కు స్వాగతం. ఈ భేతాళ కథలు గుణాఢ్యుడనే కవి సుమారు రెండువేల సంవత్సరాల క్రితం రచించిన బృహత్కథ అనే గ్రంథంలోనివి. భేతాళ కథల పేరుతో మనకు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నా.. నిజానికి మనం చెప్పుకుంటున్న ఈ కథలే అసలైన భేతాళ కథలు. ఒక సాధువు కోరిక మేరకు విక్రమసేనుడనే రాజు శింశుపా వృక్షం మీద ఉన్న శవాన్ని అమ్మవారి గుడి దగ్గరకు చేర్చడానికి ప్రయత్నిస్తుంటాడు. అతను శవాన్ని తీసుకెళ్లే సమయంలో ఆ శవంలో ఉన్న భేతాళుడు రాజుకు ఒక్కొక్కటిగా 25 కథలు చెబుతాడు. ప్రతీ కథ చివరిలో ఆ కథకు సంబంధించిన చిక్కు ప్రశ్న ఒకటి అడుగుతుంటాడు. శవాన్ని తీసుకు వచ్చేటప్పుడు మాట్లాడకూడదన్నది సాధువు చెప్పిన నియమం. కానీ తానడిగే ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలైపోతుందన్నది భేతాళుడి మాట. అందువల్లనే తెలివైన వాడైన విక్రమసేనుడు ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతుంటాడు. రాజు సమాధానం చెప్పగానే తిరిగి శవంతో సహా చెట్టు మీదకు వెళిపోతుంటాడు భేతాళుడు. మరి చివరకు ఏమయ్యిందన్నది 25వ కథ తరువాతనే మనకు తెలుస్తుంది, అలా భేతాళుడు చెప్పిన 25 కథలలో ఇప్పటి వరకూ మనం 4 కథలను చెప్పుకున్నాం. ఇక ఐదవ కథలోకి ప్రవేశిద్దాం.
- Rajan PTSK
Ещё видео!