Movie: Alari Bullodu, 1978
Song: Lechindira Bulloda
Lyrics: Veturi Sundara Rama Murthy
Music: Chakravarthy
Singers: S P Balasubrahmanyam, Chakravarthy
Audio: Saregama
గుమ్మడి:
లేచిందిరా బుల్లోడా, గొడుగు,
లేచిందిరా అల్లరి బుల్లోడా,
మందు మీద లేచింది,
సందులోకి దూరింది,
మాట వినను పొమ్మంది,
టాపు లేచిపోయిందిరా,
కృష్ణ:
దింపాలి బావ గొడుగు కిందకి,
వెయ్యాలి బావా అడుగు ముందుకి,
మందుమీద లేచినా,
మంది మీద వాలినా,
వీపు వాచిపోతుంది,
టాపు లేచిపోంతుంది బావా,
గుమ్మడి:
ఓర్నీయబ్బ ..లేచిందిరా
గుమ్మడి:
ఒరేయ్ బామ్మర్దీ,
కృష్ణ:
ఏం బావా,
గుమ్మడి:
భలే మజాగా ఉందిరా,
కృష్ణ:
నాకూ అంతే
గుమ్మడి:
ఓ మాంఛి సంగతి చెబుతాను విను,
ఆ రోజుల్లో, మనం మాంచి యమ స్పీడుగా వున్న రోజుల్లోనిమాట ,
ఎదురింటి కిటికీలో ఒక చిన్నది,
నన్ను చూసి ఒకనాడు కన్నుకొట్టింది,
మసక మసక చీకట్లో, మా ఇంటికి రమ్మంది,
ముసి ముసి నవ్వుల్లో ఉసి గొల్పింది,
కసి కసిగా చూసిందిరా బుల్లోడా, కౌగిలింత కోరిందిరా, (2)
తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని,
మాపటేల కొచ్చింది టాపు లేచిపోయిందిరా,
భజగోవిందం భజగోవిందం,
భజగోవిందం మూఢమతే, (2)
కృష్ణ:
ఎవరు బావా.. ఎవరు?
గుమ్మడి:
నీ అక్కారా, మీ అక్క,
కృష్ణ:
బావా ! నాకూ ఒక స్టోరీ వుంది చెప్పనా,
గుమ్మడి:
ఏవిటి?
కృష్ణ:
మాంచి లవ్ స్టోరీ,
ఒంటిపూస తేలాంటి ఒక చిన్నది,
వరసలె సరసమాడ రమ్మంది,
అద్దరాతి రవుతున్నా అమావాస్యనాడైనా,
హద్దు పద్దు మరచిపోయి ముద్దడిగింది,
ముద్దుల్లో ముంచేసింది, బావా,
నా కొంపే ముంచేసింది,
ఉల్లిపొర చీర కట్టి,
ఉన్నసోకు మూటగట్టి,
సరస కోచ్చి సై అంది, టాపు లేచిపోయింది బావా,
భజగోవిందం భజగోవిందం,
గోవిందం భజమూఢమతే,
గుమ్మడి:
ఎవరు?
కృష్ణ:
భజగోవిందం గోవిందం భజమూఢమతే,
గుమ్మడి:
ఎవర్రా ఎవరు?
కృష్ణ:
నీ కూతురే బావా నీ కూతరు,
గుమ్మడి:
ఆ! ఓరీ నీయబ్బ
Follow Us:
Spotify: [ Ссылка ]
Facebook:
[ Ссылка ]
[ Ссылка ]
YouTube:
Mee,Veturi
[ Ссылка ]
Veturi Sundara Rama Murthy
[ Ссылка ]
Ещё видео!