Lyrics:
నీవే శ్రావ్య సదనము
నీదే శాంతి వదనము
నీ దివిసంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతిస్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్య
1. విరజిమ్మే నాపై కృపకిరణం
విరబూసే పరిమళమై కృపకమలం
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య
2. నీనీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన నీ భాగ్యం పొందుటకు
నలిగివిరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య
3. పరిశుద్ధాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయ్య
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య
CREDITS:
Producer : Hosanna Ministries
Lyrics : Pastor Ramesh
Music : Pranam Kamlakhar
Vocals : Sireesha B
Ещё видео!