ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీటెండర్ వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకత్ రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు మరమ్మత్తులు చేపడుతామన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కు ప్రజలపై ప్రేమలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలోKCR, KTR, హరీష్ రావు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారన్నారు. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకునేందుకు ఉన్నానన్న కోమటిరెడ్డి... భారాసకు తాను చాలని వ్యాఖ్యానించారు. SLBC పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి....... BRS ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు. KTR తన ఛైర్ దగ్గరకు వచ్చి మాట్లాడాడని....... అయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లడని స్పష్టం చేశారు. ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ లోకి వస్తారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలో ప్రధానిని కలిసి.... రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. BRS ఎత్తేసిన........ అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని వివరించారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : [ Ссылка ]
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : [ Ссылка ]
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe for Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!