ప్రస్తుత ఫీఠాధ్యక్షులు :- శ్రీ శ్రీ నంబి వేణునాద స్వాములవారు
Phone no :- 94915 21530
🙏జై సద్గురు🙏👁️సద్గురు సన్నిది👁️ . ఆధ్యాత్మిక అచల ఫీఠం , వడమాలపేట, చిత్తూరు జిల్లా,🙏
*********************************************************************
నీరూపు నాకుజూపు సద్గురునాధా నీరూపునాకుజూపు
యేరూపు జూచిన నీరూపుగాజూచే
నేరుపుసూచించి నారూపు కృపజేసి !!నీ!!
మరపుతెరపునుగాని మరుగుమర్మము చూపు
తెరపేనెనని మురిసే దురితదూరుల గూల్చే !!నీ!!
జ్ఞానాజ్ఞానముగాని జ్ఞానాతీతము చూపు
జ్ఞానినేనని ప్రజ్ఞబూనిన కూల్పించే !!నీ!!
అహము యిహముగాని అనహమైనది చూపు
అహమే నేననిపల్కె నిహవృత్తి నణగించే !!నీ!!
దేహి దేహముగాని నిర్దేహమేచూపు
దేహినేననె మెహజాలము తొలగించే !!నీ!!
ద్వైతాద్వైతముగాని పరమాద్వైతము చూపు
ద్వైతాద్వైతుల వాదముల కూల్పిఖండించే !!నీ!!
తత్వతత్వముగాని మొత్తార్థమేచూపు
తత్వార్థములువిప్పి వొప్పుగ మెప్పించే !!నీ!!
గురుడు శిష్యుడుగాని మరుగే మారకచూపు
గురుశిష్యులని తిరిగే గురుదూషకుల గూల్చే !!నీ!!
స్థిరమస్థిరముగాని పరమార్ధమే చూపు
మరువక గురువాక్కు వెరువక పాలించే !!నీ!!
సైయ్యద్ బురానుల్ గురు వెయ్యారు విధముల
తియ్యగ నాధమునయ్యకు భోధించే నీరూపునాకుచూపు సద్గురునాధా !!నీ!!
Ещё видео!