Song by:
KRUPA MINISTRIES GUNTUR
Pastor Matthews
Telugu Christian songs & Tracks
Email : teluguchristiansongstracks@gmail.com
Song Lyrics -
పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||
చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2||
అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||
చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||
దీర్ఘ శాంతము గలదేవా
నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ||
చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2||
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2||
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||
Ещё видео!