#foodbook
#food
#vijayawada
విరబూసిన పువ్వులు పంచే ఆహ్లదం, ఆ పుష్పాల మకరందం,మిగల పండిన ఫలం అందించు తియ్యదనం.అలా మనసుని మీటు పరవశ అనుభూతులెన్నో ఆస్వాధిస్తే.ఇట్టే స్పందనాత్మకమై మది నిండుగా మహదానందం నింపుటలో ప్రాధమిక ఔషధమైన ఆహార సుగుణం మైమరిపిస్తుంది.ఈ వేళ ప్రసారం చేస్తున్న విజయవాడ వన్ టౌన్ లోని సుధీర్ గారి అల్పాహార శాలలో లభించు ఉపాహారం నన్నేంతగానో ముగ్ధుడిని చేసింది.నేతి అట్లు,ఇడ్లీలు కేవలం తినేందుకు ఇక్కడికి మరలా వెళ్ళాలి అనేంతలా.సుధీర్ గారి మాతృమూర్తి లక్ష్మి గారు ఉపాధి నిమిత్తం 4 దశాబ్దాల క్రితం అల్పాహార శాల ప్రారంభించి కమ్మటి ఆహార పదార్థాలు అందిస్తూ ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందారు.ప్రస్తుతం వారి కుమారుడు సుధీర్ గారు నిర్వహణ చూస్తూ లభించిని గుర్తింపును కొనసాగిస్తున్నారు పరిశుభ్రతతో కూడిన రుచికరమైన ఆహారం తక్కువ ధరకు వడ్డిస్తూ.ఇడ్లీ ముక్కను అలా తుంచి పచ్చడికి అద్ది నోటికి అందించగా వెంటనే కరిగి నాలుకమై లికించినది కమనీయ రుచి.పోతే గతంలో నేను చూసిన,తినిన పప్పుల పొడులకు ఇడ్లీలపై విరజార్చిన పొడికి చాలా వ్యత్యాసం ఉంది.మరెలా తయారు చేశారో గాని.ఉపాహార రుచిలో ఆ ద్రవ్యం యొక్క ప్రాముఖ్యత మరింతగా ఉందని చెప్పాలి..మైసూర్ బజ్జి నాకు అసలు ఇష్టం వుండదు ఇక్కడ ఇష్టంగా తిన్నాను.అట్టు రూపం నాణ్యతను,నెయ్యి సువాసన ఆహార సదాభిప్రాయాన్ని తెలుపుతుంది తినకమునుపే. లయ బద్ధంగా నములుకుంటు రాగల సారంతో అమితమైన రుచికర అనుభూతిని పొందుతూ ఆకలిని తీరిన మరొక దోశ తినాలి అని కోరిక పుట్టేలా ఉంది రుచి.మీగడ వలే లేత స్వభావంతో నాలుక ఉపాహారం రుచి వెంటనే గ్రహించేలా,ఓ పొద్దు వరకు స్థిరంగా ఉండేలా తయారు కాబడిన పచ్చడి ఈ శాలకు మంచి పేరు తెచ్చుటలో కీలకం.శుచిత్వమైన, పరిమిళ భరితమైన నెయ్యిని పరిమితి మేరకు వినియోగించడం వలన కమ్మదనం హెచ్చు మీరకపొడవంతో ఎగుటనేది పుట్టలేదు.నా ఆహార విహారన నాకు నాకు బాగా నచ్చిన అల్పాహార శాల ఇది
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!