కారం దోశలు తయారీ లో ప్రత్యేక శైలి కడప వాసులది.రుచికరమైన దోశ తయారీలో వారికున్న శ్రేష్ఠత అపారం..ముడి పిండికి తోడు ఎర్రకారం,బొంబాయి పచ్చడి మరియు పప్పుల పొడితో చక్కదన స్వరూపం దాల్చి, నిండుగా రుచి అమరిక అయ్యేలా కాల్చి అందించు కడప ఎర్రకారం దోశ తిన్నవారు మిక్కిలి తృప్తి వ్యక్తపరిచేలా ఉంటుంది.మరలా తినాలన్న ఆశ కలుగుతుంది.కనుకనే తింటే కడప కారం దోశే తినాలి అనేంతలా ప్రసిద్ధి సొంతం చేసుకుంది ఈ ప్రాంత దోసె.
కడపకు వెళ్లినప్పుడు మంచి ఎర్ర కారం దోశ తినేందుకు అదే సందర్భంలో చిత్రీకరణ కై సమాచారం కోసం స్థానికులను సంప్రదించగా హబీబుల్లా వీధిలో మూడు దశాబ్దాల నుండి నిర్వహణలో ఉన్న సుబ్బయ్య గారి అల్పాహార గురించి సమాచారం తెలపగా అక్కడికి వెళ్లి కమ్మటి కడప కారం దోశను ఆస్వాదించాము.
పని వేగ నిమిత్తం.దోసెలో ఇతర ముడి పదార్థాలను ఏకం చేయుటలో వెసులుబాటుకై కింద కూర్చుని చకచక సుబ్బయ్య గారు దోసెలు పోస్తారు..అలా అని పెనం మీద పోశాం..తీశాం అన్నట్లు ఉండరు.నిర్దిష్ట సమయం వరకూ ఇరువైపులా కాల్చుతారు.నూనె,ఎర్రకారం,బొంబాయి పచ్చడి, మరియు పప్పుల పొడి కావాల్సిన మేర వినియోగించి ఉన్నతమైన నాణ్యత గల దోసెను సిద్ధం చేసి వివిధ జోడింపులతో అందిస్తారు.పని ఒత్తిడి చెందరు..వచ్చిన వారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.
Ещё видео!