#GPS #oldpensionscheme #andhrapradesh #cmjagan #jayaprakashnarayana #loksatta
ప్రభుత్వోద్యోగులకు 20 - 30 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ వస్తుందో అందుకు తగ్గ డబ్బు అప్పటి విలువ ప్రకారం లెక్కేసి ఈవేళ్టి బడ్జెట్ లలోనే కేటాయించినంతకాలం జాతీయ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం (GPS) వంటి ప్రతిపాదనల్ని తప్పకుండా ఆలోచించవచ్చని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Eagle Media Works ఇంటర్వ్యూలో అన్నారు.
అదేసమయంలో పెన్షన్ ఫండ్ లో పెట్టుబడి ద్వారా ఆదాయంపై ఉద్యోగులకున్నసందేహాలను నిజాయితీగా పరిగణలోకి తీసుకోవాలని, 3 శాతమున్న ప్రభుత్వోద్యోగులతోపాటు ప్రైవేటు ఉపాధ్యాయులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, చేనేత, వడ్రంగి, ఎలక్ట్రీషియన్, భవన నిర్మాణం వంటి వృత్తి పనుల్లో ఉన్నవారు, నర్సులు, డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఆటో రిక్షా నడిపేవారు, తట్టలు, తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు ఇలా మిగిలిన 97% ప్రజానీకానికీ
రిటైరయ్యాక పెన్షన్ వచ్చే ఏర్పాటుకి క్రమంగానైనా మనం చర్యలు తీసుకోవాలని JP పేర్కొన్నారు.
Ещё видео!