Success Story of Red Sandalwood Farming by Matta Venkateswara Rao Vijayari Village, Pedavegi Mandal West Godavari District
ఎర్ర చందనం సాగుతో అద్భుత ఫలితాలు సాధించే దిశగా విజయరాయి గ్రామ రైతు
1995 వ సంవత్సరంలోనే అంతరర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం కలప విలువను గమనించిన రైతు మట్టా వెంకటేశ్వర రావు, తన 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా ఎర్రచందనాన్ని సాగుచేసారు. 4 ఎకరాలకు 400 మొక్కలు నాటగా ప్రస్థుతం 140 చెట్లు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని మార్కెటింగ్ కు సిద్ధమయ్యాయి. వీటిని రూ. 5కోట్లకు అమ్మేందుకు ఈ రైతు వ్యాపారులతో బేరసారాలు జరుపుతున్నారు. ఒక్కో చెట్టు కైవారం 4 - 4,5 అడుగులు రాగా, 800 కిలోల నుండి 1 టన్ను బరువుకు చేరుకుంది. గ్రేడును బట్టి టన్ను ఎర్రచందనం 10 లక్షలు నుండి 50 లక్షలు వరకు పలుకుతోంది. రైతు స్థాయిలో 1 టన్నుకు 4 - 5 లక్షలు రూపాయిలు లభించినా కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ప్రస్థుతం దేశం నుండి ఎగుమతులు నిలిచిపోవటంతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతుండటంతో, రైతు కొంతకాలం వేచిచూసే ధోరణితో వున్నారు. ఎర్రచందనం కలపకు ఇతర దేశాల్లో వన్నె తరగని డిమాండ్ వుంది. ఈ కలపజాతి వృక్షం భవిష్యత్ మున్ముందు మరింత ఆశాజనకంగా వుండనుందని శాస్త్రవేత్తలు, మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మెట్ట రైతుకు బంగారం పండించే ఎర్రచందనాన్ని ప్రతి రైతు సాగులో భాగం చేసుకుంటే, ఆర్థికంగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవచ్చంటున్న వెంకటేశ్వర రావుతో కర్షక మిత్ర రూపొందించిన స్పెషల్ స్టోరీ మీకోసం .
Facebook :://mtouch.facebook.com/maganti.veerajaneyachowdary?ref=bookmarks
#RedSandalwood # Errachandanam #Karshakamitra #Agriculture #REDSANDALWOOD
Ещё видео!