NTR జిల్లా గొల్లపూడిలోని తెలుగుదేశం కార్యాలయాన్ని అధికారులు తొలగించారు. తెలుగుదేశం ఫ్లెక్సీలు, ఫర్నిచర్ , కంప్యూటర్లను తరలించారు. కొద్ది రోజులుగా కార్యాలయ స్థలం లీజుపై వివాదం కొనసాగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబసభ్యుల మధ్య వివాదం ఉంది. లీజు వివాదంపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ కొనసాగుతోంది. ఈనెల 28న స్థల వివాదం పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు. పరిష్కరించుకునేలోపే కూల్చివేత ప్రక్రియ ప్రారంభిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో తెలుగుదశం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఉదయం 4 గంటలకే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం వైపు ఎవరూ రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. గొల్లపూడిలోని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఆయన్ని బయటకి రానీయకుండా గృహనిర్బంధం చేశారు. అనంతరం తెలుగుదేశం కార్యాలయాన్ని తొలగించారు. పార్టీ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ను వివాదాస్పద స్థలం నుంచి తొలగించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:[ Ссылка ]
☛ Subscribe to Latest News : [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!