మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
[ Ссылка ]
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించె రాతివిగ్రహము లందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
అంటూ ఈ భూమి మీద ఉన్న సుకవులందరికీ తన ఒక్క పద్యంతో వెలకట్టలేని గౌరవాన్ని, శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టిన “నవయుగ కవిచక్రవర్తి” శ్రీ గుఱ్ఱం జాషువా గారు.
ఈ కవికోకిల కవిత్వం గురించి అరగంటో, గంటో మాట్లాడుకుంటే సరిపోదు. ఆయన రచించిన ప్రతీ ఖండకావ్యాన్నీ తరచి తరచి చూడాలి. అప్పుడే ఆ పద్యాల సొగసు తెలుస్తుంది. అంతేకాదు, ఎన్నో ఖండికల నిండా పరచుకున్న ఆయన హృదయవేదనా అర్థమవుతుంది.
శ్రీనాథుడి తరువాత సీస పద్యాన్ని అంత రమణీయంగా నడిపించిన కవి జాషువా గారే అన్నది పెద్దలెందరో అనే మాట. అటువంటి సీస పద్యాలలో రెండింటిని ఈరోజు చెప్పుకుందాం.
అందులో ఒకపద్యం “నేను” అనే ఖండిక లోనిది. ఇందులో జాషువా గారు విశ్వనరుడిగా తన స్వస్వరూపాన్ని మనకు చూపిస్తారు. మనల్ని కూడా అటువంటి విశ్వనరులుగా మారమని అన్యాపదేశంగా సూచిస్తారు.
పవన్ కళ్యాణ్ “జానీ” సినిమాలో “నారాజు గాకురా మా అన్నయ్యా” అనే పాటలో ఈ విశ్వనరుడు, అన్న మాట మొదటిసారి విన్నాను. ఆ పాటలో ఒకచోట… “ఎవడేమి అంటే మనకేమిటన్నా… జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా” అని వస్తుంది. అలా ఈ విశ్వనరుడు ఎవరో తెలుసుకోవాలన్న ఉబలాటంతో సుమారు 17 సంవత్సరాల క్రితం జాషువా గారి సాహితీ వనంలో ప్రవేశించాను. ఇప్పటికీ ఆ పద్యపరిమళాలను ఆస్వాదిస్తూనే ఉన్నాను.
ఇక రెండవ పద్యం… “శ్మశానవాటి” అనే ఖండికలోనిది. మనసు పెట్టి చదివితే… మనలో ఉన్న “నేను-నాది” అనే భావనను, భ్రమను కూకటివేళ్ళతో పెకలించివేస్తుందీ ఖండిక. మానవ జీవితపు అంతిమ సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఎన్నో ఏళ్ళుగా సత్యహరిశ్చంద్ర నాటకంలో వాడబడుతున్న ఈ ప్రసిద్ధ పద్యాలలో ఒకదానిని ఈరోజు మనం చెప్పుకుందాం.
#RajanPTSK #Jashuva #Padyaalu
Ещё видео!