ఏపీ రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ ధీమా..! || అన్ని వర్గాల కోసం నవరత్నాల్లాంటి పథకాలు.. - Waytch Exclusive
జగన్ నోట నవరత్నాల్లాంటి పథకాలు..
అన్ని వర్గాల కోసం నవరత్నాల్లాంటి పథకాలు
1. వైఎస్సార్ రైతు భరోసా
ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500 లను ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి. (లబ్ధి పొందనున్న రైతు కుటుంబాలు: 66 లక్షలు)
2. వైఎస్సార్ ఆసరా
అక్కా చెల్లెమ్మల్లారా.. ఈ రోజు వరకు మీకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాలా 15 వేల కోట్లు మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలిస్తాం. (లబ్ధి పొందనున్న డ్వాక్రా మహిళల సంఖ్య: 89 లక్షలు)
3. పింఛన్ల పెంపు
ప్రతి అవ్వాతాతకి, వికలాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం.(లబ్ధిదారుల సంఖ్య: 45 లక్షలు)
4. అమ్మఒడి
పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి, 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500, ఇంటర్ చదువులకు 2000 తల్లులకు అందిస్తాం. (లబ్ధి పొందనున్న విద్యార్థులు: 40 లక్షలు)
5. పేదలందరికీ ఇళ్లు
పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖాపెట్టి పావలావడ్డీకే రుణం. (లబ్ధి పొందనున్న కుటుంబాలు: 25 లక్షలు)
6. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం
ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం. సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్. (లబ్ధి పొందనున్న కుటుంబాలు : 1.38 కోట్లు)
7. ఫీజు రీయింబర్స్మెంట్
పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు అందిస్తాం. (లబ్ధి పొందనున్న విద్యార్థులు : 15.80 లక్షలు)
8. జలయజ్ఞం
దివంగత మహానేత వైఎస్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.(అదనంగా సాగు నీరు అందేది : 56 లక్షల ఎకరాలకు)
9. దశల వారీగా మద్య నిషేధం
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. (రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే.)
--
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.
For latest news & updates : Subscribe :
--
Subscribe us @ : [ Ссылка ]
Visit us @ [ Ссылка ]
Like us on [ Ссылка ]
Follow us on [ Ссылка ]
Ещё видео!