సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గ్యాలరీ కూలడంతో వందల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని 108 సిబ్బంది, పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో గ్యాలరీలో దాదాపు 1500 మంది ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. కబడ్డీ క్రీడల కోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులురాగా... ప్రేక్షకుల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటుచేశారు.
#LatestNews
#EtvTelangana
Ещё видео!