Trivikram Srinivas has now teamed up with Jr NTR for Aravindha Sametha. On the actor's birthday, the first look of the film was launched and it received an overwhelming response. There is rumour in media that.. NTR is avoiding the comedian Srinivas Reddy intentionally.
సినిమా పరిశ్రమలో గాసిప్స్‌కు ఉన్న డిమాండ్, క్రేజ్ మరే రంగంలో ఉండదు. రూమర్లు ఎలా, ఎక్కడ నుంచి పుడుతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి ఏర్పడుతుంది. ఈ ఉపోద్ఘాతం ఇదంతా ఎందుకంటే.. అజ్ఞాతవాసి చిత్రం కొట్టిన దెబ్బకు కసితో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌తో అరవింద సమేత.. వీరరాఘవ అనే చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ జన్మదినం రోజున విడుదలైన మోషన్ పోస్టర్‌తో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ గాసిప్ గత రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. అదేమిటంటే..
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డికి మంచి స్నేహం ఉండేది. అప్పుడెప్పుడో సమైక్యాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఎన్టీఆర్ ఊరురా తిరిగివచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు సన్నిహితులుగా ఉన్న రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి చేదోడు వాదోడుగా సహాయం అందించారు. చివరిగా ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తుండగా తారక్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి కారణం శ్రీనివాసరెడ్డి అని మీడియాలో ప్రచారమైంది. ఆ కారణంతో ఆగ్రహించిన యంగ్ టైగర్.. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డిని దూరంగా ఉంచుతున్నారనేది అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివాదం గురించి స్వయంగా శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు కూడా. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు దూరంగా ఉండటమే కాకుండా ఆయన సినిమాల్లో శ్రీనివాస్‌రెడ్డి కనిపించలేదు.
ఇదిలా ఉండగా, దర్శకుడు త్రివిక్రమ్‌కు శ్రీనివాస్‌రెడ్డి సన్నిహితుడు. ఇటీవల కాలంలో ఈ కమెడియన్‌ను మాటల మాంత్రికుడు తన సినిమాల్లో మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అ.. ఆ.. చిత్రంలో శ్రీనివాస్‌రెడ్డి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే చనువుతో ఎన్టీఆర్ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డికి కీలకపాత్ర ఇచ్చారట. ఎన్టీఆర్ వద్దనలేక ఓకే అన్నారట. అక్కడే వచ్చింది చిక్కంతా.
Filmibeat Telugu
Subscribe for More Videos..
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : [ Ссылка ]
♥ Facebook : [ Ссылка ]
♥ YouTube : [ Ссылка ]
♥ twitter:[ Ссылка ]
♥ Website:[ Ссылка ]
♥ GPlus:[ Ссылка ]
♥ For Viral Videos: [ Ссылка ]
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
Ещё видео!