#ChildrensDay #AVGuravareddy
అవసరం లేని జ్ఞానాన్ని,
అనవసరమైన అజ్ఞానాన్ని,
ఎప్పటికప్పుడు జల్లడ పట్టడానికి,
దేవుడు 'పిల్లలనే' పరిమలత్వాన్ని సృష్టించుంటాడు!
రోజు నిండా ఎన్ని ఆవేశాలు-ఆక్రొషాలు ఎదురుకొన్న,
సాయంత్రానికి, గడప ముందు ఈ సిసింద్రీల చిరునవ్వుల ఎదురుకోలు
వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తుంది!
ఆ బంధాలతో మనస్సుని నింపుతుంది!
అర్థం లేని ఎన్నో చికాకుల విరుగుడికి
ఈ చిన్నారులు వజ్రాయుధాలు!
ఒక సాయంత్రాన్ని జ్ఞాపకంలా మార్చడానికి
ఈ చిరునవ్వులు మాదక ద్రవ్యాలు!
సంతోషాన్ని సంబంధాలలో నింపి,
ఆనందాలలో బంధాలని కలగలిపి,
మనవళ్లు, మనవరాళ్లు,
అరవైల్లో సంజీవినిలా ఆనందాల్ని ఆక్సిజన్ లా పంచుతుంటారు!
వాళ్ళున్న ఇల్లు, ఇల్లు లా ఉండదు
అదో హడావిడి, సంతోష తడి!
ఈ పులకరింతను, మీ ఇళ్ళల్లో మీ పిల్లల్లతో
నాలా మనస్సునిండా సంబరపరుచుకోవాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
Ещё видео!