తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన
గానం: గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్
రాగము: రామక్రియ
ఏమని పొగడవచ్చు నీతని ప్రభావము
వేమరు వో పుణ్యులాల వినరో యీ కతలు ॥పల్లవి॥
అనంత సూర్య తేజుడట కాంతి చెప్ప నెంత
దనుజాంతకుండట ప్రతాప మెంత
మనసిజ గురుడట మరి చక్కదన మెంత
వనజజుగనినయట్టి వాడట ఘన తెంత ॥ఏమని॥
గంగా జనకుడట కడు చెప్పే పుణ్య మెంత
చెంగట భూ కాంతుడట సింగార మెంత
రంగగు లక్ష్మీశుడట రాజసమ్ము లెంచ నెంత
అంగవించు సర్వేశుడట సంపదెంత ॥ఏమని॥
మాయానాథుడట మహిమ వచించు టెంత
యేయెడ తా విష్ణుడట యిర వెంత
పాయక శ్రీ వేంకటాద్రిపతియై వరములిచ్చే
వేయి రూపులవాడట విస్తార మెంత ॥ఏమని॥
-----------------------------------------------------------------------------
Emani pogaDavachchu nItani prabhAvamu
vEmaru vOpuNyulAla vinarO yIkatalu
// pallavi //
anaMtasUryatEjuDaTa kAMti cheppa neMta
danujAMtakuMDaTa pratApa meMta
manasijaguruDaTa marichakkadana meMta
vanajajuganinayTTivADaTa ghana teMta
// Emani //
gaMgAjanakuDATa kaDu jeppE puNya meMta
cheMgaTa bhUkAMtuDaTa siMgAra meMta
raMgagu lakShmISuDaTa rAjasamu leMcha neMta
aMgaviMchu sarvESuDaTa saMpa deMta
// Emani //
mAyAnAthuDaTa mahima vachiMchu TeMta
yEyeDa dA viShNuDaTa yira veMta
pAyaka SrIvEMkaTAdripatiyai varamulichchE
vEyirUpulavADaTa vistAra meMta
// Emani //
---------------------Om Namo Venkatesaya-------------------
Ещё видео!