Skanda Sashti 2021 - Subramanya Sashti 2021 - Skanda Sashti 2021 June- స్కంద షష్టి వ్రతం పూజా విధానం, వ్రత కథ, Skanda Sashti Pooja Vidhanam, Skanda Sashti Vratha katha, Kanda Sashti 2021 - Subramanya Shasti Pooja Vidhanam inTelugu - How to do Subramanya Swamy Pooja?
#SkandaShastiPuja #SubramanyaShastiPoojaVidhanamInTelugu, #SkandaShasti #SkandaShastiVratham #SubramanyaSashti, #SkandaSashtiPoojaVidhanam, #SubramanyaSwamyPoojaVidhanam #SkandaSashti2021June #LordSubramanyaSwamy
Watch Next:
స్కంద షష్టి 2021 తేదీలు మరియు తిధి : [ Ссылка ]
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి: [ Ссылка ]
ప్రతి నెల శుక్ల పక్షములో ఆరవ తిథి షష్ఠి. షష్ఠి అధి దేవత - కుమార స్వామి. దీనినే స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠి అంటారు. మార్గశిర శుక్ల శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.
ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం తప్పనిసరి. నాగ దోషాల నివారణకు, సంతానం కోసం, చదువులో రాణించడానికి, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి పూజ లేదా వ్రతం అధ్బుత ఫలితాలని ఇస్తుంది. స్కంద షష్ఠి రోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కాంద పురాణం చెబుతున్నది.
మాస షష్టి వ్రతం పూజా విధానం
ఆరోజున సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేయాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని నువ్వుల నూనె తో దీపారాధన చేయాలి.
షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. సమీపం లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి, స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం.
కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయి.
అలాగే ఈరోజు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, దక్షిణలను తాంబూలను ఉంచి ఇచ్చి నమస్కరించాలి.
వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని జపించండి .
సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం చదువుకోండి.
షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రమ్ ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్
అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ||
వ్రత కథ:
పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణువేడారు.
అప్పుడు ఆ బ్రహ్మ వారికి ఒక సూచన చేసాడు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి కావునా చంపడం మన తరంకాదు కాని ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది అనిచెప్పాడు. కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.
దేవతలు శివున్నిఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు.ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.
దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు. ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.
ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి,దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.
అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.
Ещё видео!