పాలక్ పనీర్ | Palak Paneer in Telugu | Cottage Cheese in Spinach Gravy @HomeCookingTelugu
పాలక్ పనీర్ చాలా ఫేమస్ నార్త్ ఇండియన్ గ్రేవీ కర్రీ. ఇది రోటీల్లోకి, ఫుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్లో వచ్చేట్టు ఇంట్లోనే చాలా సులువుగా ఎలా చేయాలో ఈ రెసిపీని చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేయండి.
#palakpaneer #palakpaneerrecipe #palakpaneerintelugu #teluguvantalu #cottagecheeserecipe #gravycurry #tastyvantalu
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు
పాలకూర - 1 కట్ట
మసాలా తయారుచేయడానికి కావలసిన పదార్థాలు
వెన్న - 1 టేబుల్‌స్పూన్ (Buy: [ Ссылка ])
జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఉల్లిపాయ - 1 (తరిగినది)
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం
టొమాటోలు - 2 (తరిగినవి)
పాలక్ పనీర్ చేయడానికి కావలసినవి
వెన్న - 1 టేబుల్‌స్పూన్ (Buy: [ Ссылка ])
పసుపు - 1/4 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఎండుకారం - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ధనియాల పొడి - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
జీలకర్ర పొడి - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
గరం మసాలా - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
నీళ్లు - 1 కప్పు
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
పనీర్ - 200 గ్రాములు (Buy: [ Ссылка ])
తయారుచేసే విధానం:
ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో పాలకూర ఆకులని వేసి 2 - 3 నిమిషాలపాటు ఉడికించాలి
ఇప్పుడు వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి
ఒక సాస్పాన్లో కొద్దిగా వెన్న వేసి, అందులో జీలకర్ర వేసి వేయించాలి
ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి
ఇప్పుడు టొమాటోలు కూడా వేసి చక్కగా మగ్గనివ్వాలి
ఈ మిశ్రమాన్ని చల్లార్చిన తరువాత మిక్సర్ జారులో వేసి, పాలకూర ఆకులని కూడా వేసి, ఈ రెండిటిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి
ఇప్పుడే అదే పాన్‌లో కొద్దిగా వెన్న వేసి, అందులో పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేయించాలి
ఇందులో, రుబ్బుకున్న పేస్టు, నీళ్లు, ఉప్పు వేసి ఒక ఉడుకు వచ్చేంతవరకూ ఉడికించాలి
ఐదు నిమిషాల తరువాత పనీర్ ముక్కలని కూడా వేసి, మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకూ మగ్గించాలి
దీన్ని ఫ్రెష్ క్రీంతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!