నీట్ -పీజీ పరీక్షల్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ... ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వార్షిక ఆదాయపరిమితిని... 8 లక్షలు గానే ఉంచనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. EWSలకు రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన పిటిషన్ల విచారణలో భాగంగా... కేంద్రం సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి EWS కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని ...8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో ....నిబంధనల్ని మార్చడం వల్ల.... తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది. ఈ వివాదంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరిస్తున్నామని.... అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు పొందడానికి.... వార్షికాదాయ పరిమితి 8 లక్షలుగా కొనసాగనుంది. ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మాత్రం... EWS రిజర్వేషన్ వర్తించదు. అయితే, ఈ సిఫార్సులు ప్రస్తుతం కొనసాగుతున్న అడ్మిషన్ ప్రక్రియను మాత్రం ప్రభావితం చేయబోవని కమిటీ స్పష్టం చేసింది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:[ Ссылка ]
☛ Subscribe to Latest News : [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ещё видео!