హైదరాబాద్ జంట నగరాల ట్రాఫిక్ ను నియంత్రించేందుకు GHMC మొదటి దశ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం-SRDP తీసుకొచ్చింది. ప్రధాన ట్రాఫిక్ ఏరియాల్లో పలు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించింది. ఇందులో 90 శాతం ఇప్పుడు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ కొంత వరకు తగ్గింది. ఇక రెండో విడత ఎస్ఆర్డీపీపై బల్దియా దృష్టి పెట్టింది. ఇందు కోసం 1935 కోట్ల రూపాయల నిధులతో మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మించి ట్రాఫిక్ రద్దీని మరింత తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మంత్రి కేటీఆర్ పరిశీలనలో ఉన్నాయి. మొదటి దశ ప్రాజెక్టు వ్యయం మొత్తం వివిధ బ్యాంకుల నుంచి బల్దియా రుణం కింద తీసుకుని పూర్తి చేసింది. ఇక రెండో దశ పనులకు రుణం కింద కాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Ещё видео!