#AKRWOTC #GSGL
పల్లవి:
కల్వరి ప్రేమె కనుమరుగైపోయెనా. ఆ
క్రీస్తు జాడలే సంఘాలలో మరుగాయెనా. ఆ 2
చరణం1 :
చేతులెత్తి ప్రార్ధనచేస్తు చేతిసాయమందించరు
పాటించక ప్రకటిస్తూనే ప్రభుసేవలో కొనసాగుదరు ||2||
భక్తిలేని భుక్తిపరులు - యూదాకువారసులు
సంఘాన్ని దోచుకునే - సాతానుఅనుచరులు ||2||
చరణం2 :
క్రీస్తునందు కడుగబడినను కులమతాల మత్తువదలరు
ధనికపేద తేడా లేదని వర్గాలై ఆరాదింతురు ||2||
ప్రేమయందు విఫలులు - క్రీస్తునందు నిష్పలులు
ప్రేమలేని వ్యక్తులు - క్రీస్తులేని క్రైస్తవులు ||2||
చరణం 3:
రొట్టెలోనచేయివేస్తునే క్రీస్తు బలినిమరిచినవారు
పానియాన్ని పుచ్చుకుంటునే పాపాన్నివిడవనివారు||2|
సంఘమందు ఆధికులు - వివేచింపని మూర్ఖులు
ద్రోహులైన భక్తులు - నిత్యశిక్ష అర్హులు ||2||
Ещё видео!