#Seven Ganga
#Srikalahasthi
#ab6 news
శ్రీకాళహస్తీ
సమస్త లోకాలను పాలించే చల్లని తల్లి.. భక్తుల కోర్కెలను అనుగ్రహించే కల్పవల్లి..అనంత ప్రాణకోటిని రక్షించే దయా స్వరూపిణి. గంగమ్మ జాతర వేడుకలతో జంగమయ్య క్షేత్రమైన శ్రీకాళహస్తి పులకించిపోయింది. సప్తగంగల సంగమ వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడుగంగల జాతర ప్రాభవాన్ని చూసితరిచేందుకు అశేష జనవాహినితో శ్రీకాళహస్తి భక్తజనసంద్రమైంది.
శ్రీకాళహస్తిలో ఏడు గంగల జాతర ఈ ఏడాది పురాతనసంప్రదాయ పద్ధతిలో నిర్వహించనున్నారు. కరొనా కారణంగా జాతర ను ఏకాంతంగా పురాతన సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించేలా గంగమ్మ జాతర కమిటీలు నిర్ణయించాయి...
దక్షిణ కైలాసంలో ఏడు గంగల జాతర ప్రత్యేకం
పూర్వ కాలం నుంచి జరిగే జాతర ఎంతో విశిష్టం
దేశంలో ఎక్కడా లేని సరికొత్త సంప్రదాయం
కార్తీకమాసంలో జాతర జరగడం విశేషం
గంగా జటాధారుడు కొలువైన దక్షిణ కైలాసం లో ఏడు గంగల జాతర కు విశిష్టమైన పురాణ ఇతిహాస, స్థానిక కథనాలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పూర్వ కాలం నుంచే ఏడు గంగల జాతర నిర్వహిస్తున్నట్లు చెబుతారు. శ్రీకాళహస్తి జాతరకు విశిష్టమైన ప్రత్యేకత ఉంది. దక్షిణ భారతదేశం లోనే కాదు దేశంలో ఎక్కడ కూడా కార్తీకమాసం సమయంలో జాతర జరిపే సంప్రదాయం లేదు. అయితే ఒక్క శ్రీకాళహస్తిలో మాత్రమే ఏడు గంగల జాతర చేయడం విశిష్టమైనదిగా చెప్పక తప్పదు.
శక్తి స్వరూపిణిలకు నిలయంగా భాసిల్లుతున్న దక్షిణకైలాసం
గ్రామాన్ని సంరక్షించే బాధ్యత గంగమ్మలదే
ఆ బాధ్యత స్వీకరించి ఏడు రూపాల్లో కొలువుతీరిన అమ్మవారు
గ్రామ పొలిమేరలో ఏడు చోట్ల గ్రామ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసి అమ్మవార్ల శాంతి కోసం జాతర నిర్వహిస్తున్నట్లు పురాణం చెబుతుంది...మరో కథనం మేరకు కైలాసనాథుడు పాదాలచెంత సాగుతున్న స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చి ఏడుపాయలుగా చీలి గ్రామాన్ని ముంచెత్తడంతోపాటు తీవ్ర స్థాయిలో అంటురోగాలు విజృంభించడంతో గంగమ్మ శాంతి కోసం ఏడు చోట్ల గంగమ్మలను ఉంచి జాతర నిర్వహిస్తున్నట్లు చెబుతారు. కథనాలు ఏవైనా శ్రీకాళహస్తి లో రాజులకాలం నుంచి ఏడు గంగల జాతర కార్తీకమాసంలో డిసెంబర్ మాసం మొదటి లేదా రెండో వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఏడాది గంగజాతర పురాతన సంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించేలా గంగమ్మ కమిటీలు నిర్ణయించాయి. పాత కాలంలో గంగమ్మ ఆలయం నుంచి ఏడు రూపాలు లైనా గంగమ్మ ల ను పసుపు ముద్ద రూపంలో తీర్చిదిద్ది ముక్కోణపు చాటలులో వుంచి చాకలి వారు ఊరేగింపుగా తీసుకువస్తారు....
పెళ్లి మండపం వద్ద పొన్నాలమ్మ
గాంధీ వీధిలో కొలువు దీరిన అంకమ్మ
కొత్త పేట వద్ద భువనేశ్వరి
బ్రాహ్మణ వీధిలో నల్లగంమ్మ
సంత మైదానంలో మూలస్థాన ఎల్లమ్మ
బేరి వారి మండపం వద్ద ముత్యాలమ్మ
సన్నిధి వీధిలో అంకాళమ్మ
మూలస్థానం లో ఉంచి సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా పూజలు నిర్వహించేవారు... ఈ ఏడాది అదే సంప్రదాయంలో ఆర్భాటాలకు దూరంగా గంగమ్మ ఆలయం నుంచి పసుపు ముద్దల రూపంలో తీసుకువచ్చి మూలస్థానం లో ఉంచి పూజలను నిర్వహించాలని నిర్ణయించారు... సాధారణంగా ఆధునిక పద్ధతిలో గంగమ్మ ఆలయం నుంచి తమ తమ గంగమ్మ లను ప్రత్యేక చప్పరాలు లో విద్యుత్ దీపాలంకరణ మేళతాళాలు అత్యంత ఆర్భాటంగా ఊరేగింపులు జరిపేవారు . అయితే ఈ ఏడాది కరోనా కారణంగా జన సమూహాలకు దూరంగా పరిమిత సంఖ్యలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ సంప్రదాయ పద్ధతిలో శక్తి స్వరూపాలకు పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Ещё видео!