సంస్థాగత ఎన్నికలు, రాబోయే శాసనసభ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన.. తదితర అంశాలే ప్రధాన ఏజెండాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దిల్లీలోని.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ భేటీలో... పంజాబ్ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలను కూడా... చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుతం సోనియా గాంధీ కొనసాగుతున్నారు. ఆమె స్థానంలో రాహుల్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ లు వినిపిస్తున్న వేళ.... ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు.. పార్టీ సంస్థాగత ఎన్నికలపై కూడా ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పంజాబ్, UP సహా.. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఎదురవుతున్న సవాళ్లు పరిష్కరించాలంటూ G-23గ్రూప్ సభ్యులు సోనియాకు రాసిన లేఖ వ్యవహారంపై చర్చించే అవకాశం ఉంది. లఖింపూర్ ఖేరీ ఘర్షణ, రైతు సమస్యలపై పోరాటం చేసే విధివిధానాలపై కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో చర్చించనున్నారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe for Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-------------------------------------------------------------------------------------------------------
Ещё видео!