ఫిష్ పుట్టు | Fish Puttu | Fish Bhurji | Scrambled Fish @HomeCookingTelugu
గుడ్డుతో మనం బుర్జీ చేసుకుని తింటుంటాము. కానీ అదే పద్దతిలో చేపతో కూడా బుర్జీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ పుట్టు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంతుంటుంది. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోను చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#fishputtu #teluguvantalu #fishrecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు
వంజరం చేప - 6 ముక్కలు
ఉప్పు- రుచికి సరిపడా (Buy: [ Ссылка ])
పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: [ Ссылка ])
వెల్లుల్లిపాయలు - 2 (తరిగినవి)
అల్లం ముక్క (తరిగినది)
పచ్చిమిరకాయలు - 2 (తరిగినవి)
కరివేపాకులు
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఎండుకారం - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
మిరియాల పొడి - 1 / 4 టీస్పూన్ (Buy: [ Ссылка ])
ఉల్లిపాయ - 1 (తరిగినది)
కొత్తిమీర (తరిగినది)
తయారుచేసే విధానం
చేపని ఉప్పు, పసుపు వేసి రుద్దుకున్న తరువాత పది నిమిషాలు పెట్టుకోవాలి
ఒక పాన్లో నీళ్లు పోసి, మరిగినచాలి
ఇందులో చేప ముక్కలని వేసి ఉడికించిన తరువాత, వాటి తోలుని, వాటిలో ఉన్న ఎముకల్ని తీసేయాలి
ఒక వెడల్పాటి పాన్లో నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు, పసుపు, ఎండుకారం, మిరియాల పొడి, ఉప్పు వేసి, అందులో ఉల్లిపాయలు వేసి అవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి
ఉల్లిపాయలు రంగు మారిన తరువాత తుంచిపెట్టుకున్న చేప ముక్కలని వేసి అంతా బాగా కలుపుకోవాలి
ఒకసారి రుచి చూసుకుని ఉప్పు కలుపుకోవచ్చు
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే, ఫిష్ పుట్టు చాలా బాగుంటుంది
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!