#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
=====
అంజని తనయా శ్రీ హనుమంతా
పాలించ రావేమయా శ్రీ ఆంజనేయ దీవించ రావేమయా
శ్రీరామ నామము ఏ చోట పల్కినా
ఆంజనేయ ఆ చోట భక్తితో నిలచునే
కావరావయా కాపాడ రావయా
పాలించ రావేమయా శ్రీ ఆంజనేయ దీవించ రావేమయా
శ్రీరామ రూపము హృదయ మందు నిలిపినా
ఏకైక భక్తుడవు నీవేనయా
కావరావయా కాపాడ రావయా
పాలించ రావేమయా శ్రీ ఆంజనేయ దీవించ రావేమయా
నీ నామ గానము అనునిత్యము పలికినా
ఈతి బాధలండవు ఇలలో మాకు
కావరావయా కాపాడ రావయా
పాలించ రావేమయా శ్రీ ఆంజనేయ దీవించ రావేమయా
Ещё видео!