చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
శివరంజనిరాగం. ఆది తాళం
గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం.
సాకి
చావు తప్పదనే సత్య మెరిగి కూడ"2"
చర్మ దేహము చూసి గర్వపడుతూ.... సర్వాధికారియైన స్వామినే మరచి నీవు....
ఘోర నరక మందు దూరెద
వూ...
బ్రహ్మ తత్వ మెరుగకా.భక్తిని విధానాడి .
ధనము ధనమంటూ నీవు మదము తోనా... ఆ...ఆ.. ఆ...
ప్రాకులాడి ధరపై పాపి కాకు..."2"
తెలుసుకోర నరుడ బ్రతుకు మర్మం.. ఆ... ఆ... ఆ....
పల్లవి
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
రాశాడు ఆ బ్రహ్మ రాత
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా ... చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం 1
పువ్వులు పూసే పొదరిల్ల లోన గుడిలోన కొన్ని జడలోన కొన్ని
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం 2
ఉన్న నాడు అందురు కలరు
పోయిన నాడు ఎవరు రారు
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ. ఈ మట్టిబొమ్మ..
చరణం3
అనుకున్న దేదో జరగక పాయే జరిగేదేదో తెల్వక పాయే
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ
చరణం4
గండిలో వెలసిన ఓ అంజన్న
మమ్మేలు స్వామివని నిను నమ్మినాము
రాశాడు ఆ బ్రహ్మ రాతా
ఎట్లు రాశాడో ఆ బ్రహ్మ రాతా
చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ.
ఎత్తు
జై జై ఆంజన్న జై భజరంగీ ఆంజన్న
సాకి
హనుమా... ఆంజనేయా.. మారుతీ....
Ещё видео!