Learn Here SRI RAMA NEE NAMA MEMI RUCHIRA| SRI RAMA | BHADRACHALA RAMADASU#devotional
శ్రీరామ నీ నామమేమి రుచిరా ( భద్రాచల రామదాసు కీర్తన )
రాగం : ఖరహర ప్రియ తాళం : ఆది శృతి : 7 ( B )
శ్రీరామ నీ నామమేమి రుచిరా
ఓ రామ నీ నామ మెంత రుచిరా || శ్రీరామ ||
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామమేమి రుచిరా
కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీ నామమెంత రుచిరా
కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ పతిత పావన నామమేమి రుచిరా
పతిత పావన నామమెంత రుచిరా || శ్రీరామ ||
నవరస పరమాన్న నవనీతములకన్న అధికమౌ నీ నామమేమి రుచిరా
నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌ నీ నామమెంత రుచిరా
పనస జంబు ద్రాక్ష ఫల రసముల కన్న మధురమౌ నీ నామమేమి రుచిరా
మధురమౌ నీ నామమెంత రుచిరా || శ్రీరామ ||
అంజనా తనయ హృత్కంజ దళమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా
అంజనా తనయ హృత్కంజ దళమునందు రంజిల్లు నీ నామమెంత రుచిరా
సదాశివుడు నిన్ను సదా భజించెడి సదానంద నామమేమి రుచిరా
సదానంద నామమెంత రుచిరా ||శ్రీరామ ||
సారము లేని సంసారమునకు సంతారకమగు నామమేమి రుచిరా
సారము లేని సంసారమునకు సంతారకమగు నామమెంత రుచిరా
శరణన్న జగముల సరగున రక్షించు బిరుదు గల్గిన నామమేమి రుచిరా
బిరుదు గల్గిన నామమెంత రుచిరా || శ్రీరామ ||
తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసెడి నామమేమి రుచిరా
తుంబురు నారదులు డంబు మీరగ గానంబు జేసెడి నామమెంత రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా
ఏలిన నీ నామమెంత రుచిరా ||శ్రీరామ ||
Sri Rama nee namamemi ruchira ( Bhadrachala Ramadasu Keerthana)
Ragam : kharaharapriya Talam : Adi Sruti : B ( 7 )
Sri Rama nee namamemi ruchira
O Rama nee namamentha ruchira || Sri Rama ||
Kariraja prahlada dharanee vibheeshanula gachina nee namamemi ruchira
Kariraja prahlada dharanee vibheeshanula gachina nee namamentha ruchira
Kadali kharjooradi phalamulakadhikamou Pathithapavana namamemi ruchira
Pathithapavana namamentha ruchira || Sri Rama ||
Navarasa Paramanna navaneethamula kanna adhikamou nee namamemi ruchira
Navarasa Paramanna navaneethamula kanna adhikamou nee namamentha ruchira
Panasa jambu draksha phalarasamulakanna Madhuramou nee namamemi ruchira
Madhuramou nee namamentha ruchira || Sri Rama ||
Anjana thanaya hruthkanja dalamunandu ranjillu nee namamemi ruchira
Anjana thanaya hruthkanja dalamunandu ranjillu nee namamentha ruchira
Sadasivudu ninnu sada bhajinchedi Sadananda namamemi ruchira
Sadananda namamentha ruchira || Sri Rama |
Saramu leni samsaramunaku santharakamagu namamemi ruchira
Saramu leni samsaramunaku santharakamagu namamentha ruchira
Sarananna jagamula saraguna rakshinchu birudu kalgina namamemi ruchira
birudu kalgina namamentha ruchira || Sri Rama ||
Thumburu Naradulu dambu meeraga ganambu jesedi namamemi ruchira
Thumburu Naradulu dambu meeraga ganambu jesedi namamentha ruchira
Araya bhadrachala srirama dasuni elina nee namamemi ruchira
elina nee namamentha ruchira || Sri Rama ||
#srirama neenamamemi ruchira#jaisriram#DeviSongs#bhadrachala ramadasa
► Click Here To [ Ссылка ]
* Details *
SINGER : GEETANJALI
Enjoy and stay connected with us!!
► [ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!