Mullangi Pachadi | ముల్లంగి పచ్చడి | Mullangi Chutney in Telugu | Radish Chutney Andhra Style @HomeCookingTelugu
#mullangipachadi #pachadi #raddishchutney #chutney #homecookingtelugu #hemasubramanian
Mullangi Sambar : [ Ссылка ]
Our Other Pachadi Recipes :
Kottimeera Roti Pachadi: [ Ссылка ]
Tomato Kottimeera Roti Pachadi: [ Ссылка ]
Palli Tomato Pachadi: [ Ссылка ]
Kobbari Mamidikaya Pachadi: [ Ссылка ]
Pudina Pachadi: [ Ссылка ]
Beerakaya Pachadi: [ Ссылка ]
Chapters:
Promo & Intro : 00:00
Making Pachadi : 00:28
Tempering : 05:18
Serving and Tasting: 05:55
కావాల్సిన పదార్ధాలు :
నూనె - 3 టీస్పూన్లు
ముల్లంగి - 2
ఉల్లిపాయ - 1
పచ్చికొబ్బరి - 1/2 కప్పు
కరివేపాకులు
చింతపండు
కల్లుప్పు - 1 టీస్పూన్
పసుపు
నూనె - 1 టీస్పూన్
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
జీలకర్ర - 2 టీస్పూన్లు
ఎండుమిరపకాయలు - 8
తాలింపుకు కావాల్సిన పదార్ధాలు :
నూనె
ఆవాలు
జీలకర్ర
ఎండుమిరపకాయ - 1
ఇంగువ
కరివేపాకులు
తయారీ విధానం :
ముందుగా ఒక కడై తీసుకొని అందులో మూడు టీస్పూన్లు నూనె , రెండు ముల్లంగులు చిన్న ముక్కలుగా కోసి వేసుకొని హై ఫ్లేమ్ లో రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి.
రెండు నిముషాలు తరువాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగి వేసుకొని రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. తరువాత అరా కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి.
ఒక నిమిషం తరువాత కొద్దిగా కరివేపాకు , కొద్దిగా చింతపండు , ఒక టీస్పూన్ కల్లుప్పు , కొద్దిగా పసుపు వేసి వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇపుడు ఇంకో చిన్న కడై పెట్టుకొని అందులో ఒక టీస్పూన్ నూనె , రెండు టేబుల్స్పూన్లు ధనియాలు , రెండు టీస్పూన్లు జీలకర్ర , ఎనిమిది ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు రంగు మారేదాకా వేయించుకొని , ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇపుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న ధనియాలు , ఎండుమిర్చి , జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన ముల్లంగి, పచ్చికొబ్బరి మిశ్రమం వేసి నీళ్ళు పోయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని , గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత తాలింపు కోసం తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె , కొద్దిగా ఆవాలు , కొద్దిగా జీలకర్ర , ఒక ఎండుమిరపకాయ , కొద్దిగా ఇంగువ వేసి వేయించుకోవాలి , తరువాత స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకోవాలి.
చేసిపెట్టిన పచ్చడి లో తాలింపు వేసి కలుపుకుంటే ఎంతో అద్భుతమైన ముల్లంగి పచ్చడి తయారైనట్లే.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!