ప్రస్తుత ఫీఠాధ్యక్షులు :- శ్రీ శ్రీ నంబి వేణునాద స్వాములవారు
Phone no :- 94915 21530
🙏జై సద్గురు🙏👁️సద్గురు సన్నిది👁️ . ఆధ్యాత్మిక అచల ఫీఠం , వడమాలపేట, చిత్తూరు జిల్లా,🙏
*********************************************************************
గురుకరుణే పరమౌషధము గురుదూషకులకు
గురుడునరుడని గురునిగానక గురుపరంపర సరళిదెలియక
గురువునేనని తనకుతానే మురియుచుండె మొప్పెనరులకు ౹౹గు౹౹
గురువునెప్పుడు నిందజేయుచును గురువాజ్ఞమీరి
గురువునేనని దిక్కరించుచును తెరవుగానక శిష్యులకు
గురుతెరుగు నెరుకను బోధించుచు యిరువు దెలియక
పరుగులాడుచు మొరుగుచుండే మొరటజనులకు ౹౹గు౹౹
మంత్రతంత్ర యంత్రములు నేర్చి
స్వతంత్రమున బల్ వింతగా గురుమంత్రములు జదివి
యెంతలేదని పెద్దలను మీరెంతవారని అంతు దెలియక
అంతరాంతరమందు ద్వాదశి చింతలేని కుతంత్ర ఖలులకు ౹౹గు౹౹
తిన్నగా షోడశిని గనలేక
యెన్నెన్నొ సాధనలన్ని ముద్రలు లక్ష్యములు జూచి
తన్ను తానెరుంగవలెనని యెన్న రానిడిమండ్లు బడుచు
మన్ననతొ గురు మరుగు దెలియక పన్నుగ బ్రమపడెడువారికి ౹౹గు౹౹
మానసంబున ద్వాదశాబ్దములు
వినయముతో గురు సేవజేసిన దీనులకు నిలను
రానిపోనిబయలు దెల్పక జ్ఞానకర్మలు బోధించుచు
కాననంబున నిర్జలస్థల స్థానమందు తపించు జడులకు ౹౹గు౹౹
గురుపరంపర ముందుగాజూపి
గురుకీలుగనుమని గురుతులేని పరమునీవనుచు
స్థిరముగా సై య్యద్ బురానుల్ తరతరంబుగ గురుపరంపర
అరమరేమియు లేక నాథముననుభవించనె గురునివాక్యము ౹౹గు౹౹
********************************************************************
Ещё видео!