యాదాద్రి గర్భాలయంపై నిర్మించిన విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని యాడా నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 60 కిలోల బంగారం అవసరమవుతుందని యాడా, ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాతల నుంచి దీనిని సేకరించాలని నిర్ణయించినట్లు.... ఈ మేరకు దాతలు ముందుకు రావాలని ఆలయ ఈవో కోరారు. ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగులు అమర్చే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాగి తొడుగుల తయారీ ఇప్పటికే పూర్తయింది. వాటికి బంగారు తాపడం చేసి టేకు రథానికి అమర్చే పని మిగిలి ఉండగా.... దీనిని పది రోజుల్లో పూర్తి చేస్తామని.... ఈ పనులు చేస్తున్న చెన్నైకు చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకునే అవకాశముందన్నారు.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: [ Ссылка ]
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: [ Ссылка ]
☛ Subscribe for Latest News - [ Ссылка ]
☛ Subscribe to our YouTube Channel : [ Ссылка ]
☛ Like us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Follow us : [ Ссылка ]
☛ Etv Win Website : [ Ссылка ]
-------------------------------------------------------------------------------------------------------
Ещё видео!