#Sree Maha sudarshana mantram
#lordvishnusongs #Bhakthisongs
శ్రీ సుదర్శన మహామంత్రం
Sri Sudarshana Maha Mantram
ఈ మంత్రం పఠించడం వలన ఆయురారోగ్యాలు మెరుగవుతాయి.. శత్రు భయం ఉన్నవారు చదివితే శత్రు వినాశనం జరుగుతుంది.. రోగములన్నీ పటాపంచలు అవుతాయి..
సుదర్శన మంత్రం శత్రువులు విసిరే అస్త్ర, శస్త్ర, మంత్ర, తంత్రముల నుండి.. మృత్యువు నుండి సర్వ రోగములనుండి విడిపించి ఆయుష్షును పెంచుతుంది
సుదర్శన చక్రము యొక్క ప్రస్థావన పురాణాలలో మూడు సార్లు మనకు కనిపిస్తుంది...
ఒకటి అంబరీషుడిని అకారణంగా శపించిన దుర్వాస మహర్షిని తరుముతూ చివరకు దుర్వాసుడు అంబరీషుడిని శరణు వేడాక శాంతిస్తుంది ఇది కార్తీక పురాణంలో ద్వాదశి వ్రతకధ లో వచ్చే ఘట్టము
మరొకటి గజేంద్ర మోక్షములో మొసలిని సంహరించేందుకు విష్ణువు ప్రయోగించిన ఆయుధం
మూడవది శిశుపాలుడ్ని సంహరించేందుకు కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు
ఈ సుదర్శన చక్రం పుట్టుకను గురించి మూడుకథలున్నాయి.
1. సూర్యభగవానుడు విశ్వకర్మపుత్రిక అయిన సంజ్ఞను పరిణయమాడతాడు. సూర్యతేజాన్ని భరించలేనని సన తన తండ్రి విశ్వర్కర్మతో చెబుతుంది. అప్పుడు విశ్వకర్మ ఒక యంత్రం ద్వారా సూర్యతేజస్సును తగ్గిస్తాడు. యంత్రంలో సూర్యుని పెట్టి త్రిప్పిన సందర్భాన రాలిన రజం వల్ల విశ్వకర్మ చక్రాన్ని తయారు చేస్తాడు. ఇది విష్ణువుకు ఇవ్వబడుతుంది. (విష్ణుపురాణం – 3వ ఆంశం – అధ్యాం 2).
2. ఇంద్రుడు వర్షాన్ని వర్షించడంవల్ల ఖాండవదహనాన్ని అడ్డుకుంటాడు. ఆ సందర్భాన సుదర్శనాన్ని, గాంఢీవాన్ని కృష్ణార్జులకు అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. అందువల్ల సుదర్శనానికి అగ్నేయం అని కూడా పేరు. ఖాండవదహనం పూర్తయ్యాక ఈ ఆయుధాలు తిరిగి గ్నికి ఇవ్వబడతాయని కూడ ఒకచోట వ్రాయబడింది.
3. సుదర్శనాయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడ మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సమ్హరించేందుకు గాను చక్రన్ని శివుడు విష్ణువుకు ఇస్తాడు. దానిని శివుడు సుదర్శనచక్రం అని పిలుస్తాడు.
సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణలలో చాలా గాథలున్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణగాథల వల్ల తెలుస్తోంది.
సుదర్శనశక్తి అద్భుతమైంది.
ఇది శత్రువులను అగ్నివలె దహిస్తుంది. శత్రుసంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది.
మహాభారతం ఆదిపర్వం 16వ ఆధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉంది.
శ్రీవైష్ణవ సంప్రదాయంవారు సుదర్శనాన్ని చక్రత్తాళ్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపునాడ్ జరిగే చక్రస్నానం/అవబృదస్నానం చక్రత్తాళ్వార్ కే చేస్తారు.నిగమాంతమహాదేశికులవారు సుదర్శనం గొప్పతననాన్ని చాటి చెప్పారు. తమిళనాడు – చెంగల్పట్టు జిల్లాలోని తిరుపుళ్కుషి గ్రామంలో ఒకానొకప్పుడు ప్రజలు తీవ్రజ్వరంతో బాధపడుతుంటారు. ఆ సందర్భాననిగమాతదేశికులవారు సుదర్శనాన్ని ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తారు. తను రచించిన రమణీయమైన సుదర్శనాష్టకాన్ని పఠిస్తారు. అప్పుడు ఆ గ్రామస్తులు జ్వరపీడ నివృత్తులై ఆరోగ్యవంతులవుతారు.
చక్రత్తాళ్వార్లు సర్వకాల సర్వావస్థలయందు కూడ భగవానుని సన్నిధానంలోనే ఉంటారు. పెరుమాళ్ళు హిరణ్యాక్షుని సంహరించిన సందర్భంలోచక్రత్తాళ్వార్లు వరహాస్వామివారి కోరలరూపంలో ఉన్నారని విశసించబడుతోంది. హిరణ్యాక్షుని చీల్చిన నరసింహుని పదివేళ్ళకు ఉండే నఖాలరూపంలో సుదర్శనుడు ఉన్నాడంటారు. పరశురామావతారంలో సుదర్శనం పరశువుగా మారినట్లు చెప్తారు. రామావతారంలో సుదర్శనం ఒక జ్యోతి ఆకారంలో రాముని అంటిపెట్టుకొని ఉండేదట. రాముని విల్లు అంబులుగా సుదర్శనం అవతరించిందని కూడా చెప్తారు. వామనావతారలో సైతం సుదర్శనం పెరుమాళ్ళుకు సహాయంగా ఉందంటారు. దీని ఆధారంగా పెరియాళ్వార్లు రచించిన ఓ పాశురంలో కమండలం ద్వారా నీరు రాకుండా తేనెటీగ రూపంలో అడ్డూడిన శుక్రుని, సుదర్శనుడు దర్భరూపంలో ఉండి తొలగించినట్లు చెప్పబడింది. ఒకానొక సందర్భాన శివపార్వతులు కైలాసంలో రత్న సింహాసనాసీనులయి ఉంటారు. పార్వతి ఏమంత్రాన్ని జపిస్తే కార్యసిద్ధి కలుగుతుందని శివుని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమశివుడు పార్వతికి ప్రేమతో సుదర్శన మహామంత్రానికి అంతటిశక్తిని కలిగి ఉందని తెలియజేస్తాడు.
శ్రీ సుదర్శన మహామంత్రం
ఓం కృష్ణాయ గోవిందాయా గోపిజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర మంత్ర ఔషద అస్త్ర శస్త్రాణి సంహార సంహార మృథ్యొర్ మొచయ మొచయ ఆయుర్ వర్థయ వర్థయ శత్రూర్ నాశయ నాశయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ ధిక్ శోభనకరాయ హుం ఫట్ బ్రాహ్మణే పరం జ్యోతిషే స్వాహా |
ఓం నమో భగవతే సుదర్శనాయ | ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ||
మహా చక్రాయా మహా జ్వాలయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమొచనాయ పాదాధిమాస్త్యపర్యంతం వాత జనిత రోగాన్ పిత్హా జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసన్గలి గొధ్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార హుం ఫట్ స్వాహా ||
VISHNU Stotrams -- [ Ссылка ]
SHIVA Stotrams -- [ Ссылка ]
Hanuma Stotrams -- [ Ссылка ]
Ganesha Stotrams -- [ Ссылка ]
Aditya Stotrams -- [ Ссылка ]
Datta/Sai Stotrams -- [ Ссылка ]
Devatha Stotrams -- [ Ссылка ]
Please feel free to leave me a note if You find this upload is inappropriate.
email address: common2040@gmail.com
Ещё видео!