ప్రముఖ కవి, గాయకుడు, TRS MLC గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు. 2020-21 సంవత్సరానికి ఆయన రాసిన కవితా సంపుటి వల్లంకి తాళం కు కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డు ప్రకటించింది. పల్లె పాటలతో ఎంతో ప్రాచుర్యం పొంగిన గోరటి వెంకన్న.. వల్లంకి తాళం తోపాటు.. ఏకునాదం, మోత, రేలపూతలు, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు.
కాగా.. తూగుళ్ల గోపాల్ ను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి దేవరాజ్ మహారాజ్ బాలసాహిత్య అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి మొత్తం 20 భాషలకు సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించింది. త్వరలో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారం తోపాటు నగదు బహుమతిని అందచేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది.
గోరటి వెంకన్న కు ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. వల్లంకి తాళం కవితా సంపుటిలో మనిషికి, ఇతర జీవాలకు ఉన్న అనుబంధాన్ని గోరటి వెంకన్న అద్భుతంగా ఆవిష్కరించారని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ మట్టి వాసనలను తన సాహిత్యం విశ్వవ్యాప్తం చేశారని అన్నారు. ఆయనకు దక్కిన ఈ సాహితీ గౌరవం తెలంగాణ మట్టిమనిషికి దక్కిన గౌరవంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. గోరటికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు మంత్రులు గోరటి వెంకన్నకు అభినందనలు తెలిపారు.
Ещё видео!